క్రీడాభూమి

మెల్‌బోర్న్‌ను తలదన్నేలా..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లాభాయ్ పటేల్ స్టేడియం (మోటేరా స్టేడియం) త్వరలోనే గుర్తింపును అందుకోనుంది. 2011 వరకు ఈ మైదానంలో 23 వన్డే మ్యాచ్‌లు జరగ్గా, 2015లో మైదానాన్ని కూల్చి, స్టేడియం విస్తరణ పనులు చేపట్టారు. గతంలో ఇక్కడి మైదానంలో 49వేల మంది కూర్చోని మ్యాచ్‌ని వీక్షించేలా నిర్మించగా, ప్రస్తుతం 1,10,000 మంది కూర్చునేలా స్టేడియాన్ని విస్తరిస్తున్నారు. ఇప్పటివరకు ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ మైదానంగా గుర్తింపును అందుకున్న ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ మైదానంలో 1,00,024 మంది కూర్చొని మ్యాచ్‌ను వీక్షించవచ్చు. ప్రస్తుతం దీనిని సర్దార్ వల్లాభాయ్ పటేల్ స్టేడియం అధిగమించనుంది.
చిత్రం.. సర్దార్ వల్లాభాయ్ పటేల్ క్రికెట్ స్టేడియం