క్రీడాభూమి

‘నంబర్ వన్’ మేరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 10: ఆరు పర్యాయాలు ప్రపంచ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్న భారత లెజెండరీ బాక్సర్ మేరీ కోమ్ తన కెరీర్‌లో ఉన్న శిఖరాన్ని అధిరోహించింది. అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఏఐబీఏ) తాజాగా ప్రకటించిన ప్రపంచ ర్యాంకింగ్స్ మహిళల విభాగంలో 48 కిలోల విభాగంలో ఆమె నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించింది. 36 ఏళ్ల మేరీ గత ఏడాది నవంబర్ మాసంలో, ఢిల్లీలో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో టైటిల్ సాధించిన విషయం తెలిసిందే. కెరీర్‌లో ఆమె ఈ టైటిల్‌ను అందుకోవడం అది ఆరోసారి. 48 కిలోల విభాగంలో 1,700 పాయింట్లతో ఆమె నంబర్ వన్‌గా ఎదిగింది. ఇలావుంటే, 2020 ఒలింపిక్స్‌లో 51 కిలోల విభాగంలో పోటీ పడేందుకు మేరీ సిద్ధమవుతున్నది. ఇంత వరకూ అధికారికంగా భారత బృందంలో ఆమె పేరు లేదు. జాబితాలను సమర్పించే సమయంలోగా అధికారులు ఆమె పేరును 51 కిలోల విభాగంలో చేర్చే అవకాశాలు ఉన్నాయి.