క్రీడాభూమి

మొదటి వనే్డకు మిచెల్ మార్ష్ దూరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిడ్నీ, జనవరి 10: భారత్‌తో శనివారం జరిగే మొదటి వనే్డ ఇంటర్నేషనల్‌కు ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ దూరమయ్యాడు. అనారోగ్యంతో బాధపడుతున్న అతను మొదటి వనే్డలో ఆడే అవకాశం లేదని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. అతని స్థానంలో ఆష్టన్ టర్నర్‌ను స్టాండ్ బైగా ఉంచినట్టు పేర్కొంది. ఉదర సంబంధమైన సమస్యతో మిచెల్ మార్ష్ గత రెండు రోజులుగా ఆసుప్రతిలో చికిత్స పొందుతున్నాడని ఆసీస్ కోచ్ జస్టిన్ లాంగర్ తెలిపాడు. ఫిట్నెస్ సమస్య కారణంగా అతను మొదటి వనే్డలో ఆడడం లేదని, అయితే, 15, 18 తేదీల్లో జరిగే మిగతా రెండు వనే్డలకు అందుబాటులో ఉంటాడని వివరించాడు.