క్రీడాభూమి

పాండ్య, రాహుల్‌పై వేటు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 10: అమ్మాయిల పట్ల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన భారత క్రికెటర్లు హార్దిక్ పాండ్య, లోకేష్ రాహుల్ కఠిన శిక్షను ఎదుర్కోబోతున్నట్టు సమాచారం. వీరిపై వేటు వేయాలని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ)కి సుప్రీం కోర్టు నియమించిన పాలక మండలి (సీఓఏ) యోచిస్తున్నట్టు తెలుస్తున్నది. సీఓఏ చీఫ్ వినోద్ రాయ్ వీరిద్దరికీ రెండేసి వనే్డల చొప్పున సస్పెన్షన్ వేటు విధిస్తే సరిపోతుందని అభిప్రాయపడుతున్నాడు. అయితే, సభ్యురాలు, భారత మాజీ మహిళా క్రికెటర్ డయానా ఎడుల్జీ మాత్రం వీరిపై చట్టపరమైన చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నది. ఇప్పటికే వీరి వ్యవహారాన్ని బీసీసీఐ లీగల్ సెల్ దృష్టికి ఆమె తీసుకెళ్లింది. అమ్మాయిలతో శృంగారంలో పాల్గొంటున్నానని, పిలవగానే తనతో గడిపేందుకు ఎంతో మంది సిద్ధంగా ఉంటారని పాండ్య చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. రాహుల్ కూడా అమ్మాయిలను కించపరిచే విధంగా, అవమానకరమైన భాషను ఉపయోగించాడు. శృంగారానికి అమ్మాయిలు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారన్న అతని వ్యాఖ్యలపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతున్నది. సీవోఏ కూడా ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నది. ఇద్దరూ వేరువేరు ప్రకటనల్లో క్షమాపణ చెప్పినప్పటికీ, వారిపై నిరసనలు వెల్లువెత్తుతునే ఉన్నాయి. ఈ నేపథ్యంలో సీవోఏ సిఫార్సు చేయబోయే చర్యలపై ఆసక్తి నెలకొంది.