క్రీడాభూమి

విరాట్ కోహ్లీ, రవి శాస్ర్తీకి సిడ్నీ గౌండ్‌లో గౌరవ సభ్యత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిడ్నీ, జనవరి 11: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, జట్టు ప్రధాన కోచ్ రవి శాస్ర్తీకి అరుదైన గౌరవం దక్కింది. వీరిద్దరూ క్రికెట్‌కు అందించిన అపార సేవలకుగాను ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ (ఎస్‌సీజీ)లో శుక్రవారం గౌరవ సభ్యత్వాన్ని దక్కించుకున్నారు. 71 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా గడ్డపై ఆతిధ్య జట్టును నాలుగు టెస్టుల సిరీస్‌ను 2-1 తేడాతో ఓడించి భారత్ ఘన విజయాన్ని నమోదు చేసింది. ‘ఆసిస్ మైదానంపై తొలిసారిగా టెస్టు సిరీస్‌ను చేజిక్కించుకున్నందుకు ఎస్‌సీజీ అభినందనలు తెలుపుతోంది. ఇది అత్యద్భుతం. అతి పెద్ద క్రికెట్ దేశంగా వెలుగొందుతున్న భారత్ ఇంతటి ఘనత సాధించి క్రికెట్‌ను విశ్వవ్యాప్తం చేసింది’ అంటూ ఎస్‌సీజీ చైర్మన్ టోనీ షెపెర్డ్ తన అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొన్నాడు. కోహ్లీతోపాటు తనకు ఎస్‌సీజీలో గౌరవ సభ్యత్వం దక్కడం గొప్ప ఘనతగా అభివర్ణించాడు టీమిండియా కోచ్ రవి శాస్ర్తీ. ఈ సిడ్నీ మైదానంలో గౌరవ సభ్యత్వం పొందినవారిలో క్రికెట్ దిగ్గజాలు సచిన్ తెండూల్కర్, బ్రియాన్ లారా ఉన్నారు.