క్రీడాభూమి

రాహుల్, పాండ్యపై నిషేధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిడ్నీ, జనవరి 11: ఆస్ట్రేలియా గడ్డపై 71 ఏళ్ల తర్వాత తొలిసారిగా టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకున్నామన్న విజయగర్వంతో ఉన్న టీమిండియాకు కాఫీ విత్ కరణ్ టీవీ షోలో మహిళలపై అనుచితంగా, అసభ్యకరంగా యువ క్రికెటర్లు కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్య చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపుతున్నాయి. ఈ ఏడాది ఇంగ్లాండ్‌లో ప్రారంభమయ్యే వరల్డ్ కప్‌కు ఇప్పటినుంచే సన్నాహాలు మొదలుపెట్టిన నేపథ్యంలో వారిద్దర్నీ శనివారం ఆతిధ్య ఆస్ట్రేలియాతో జరుగనున్న తొలి వనే్డ ఇంటర్నేషనల్ మ్యాచ్‌లలో ఆడకుండా బీసీసీఐ తాజాగా నిర్ణయం తీసుకుంది. అయితే, రాహుల్, పాండ్య మహిళలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై ఒక మ్యాచ్‌లో ఆడకుండా సస్పెండ్ చేసిన నేపథ్యంలో వారిపై తదుపరి చర్యలు తీసుకునేందుకు వీలుగా సమగ్ర దర్యాప్తు చేపడతామని పాలక వర్గ కమిటీ (సీఓఏ) చైర్మన్ వినోద్ రాయ్ స్పష్టం చేశాడు. అయితే, యువ క్రికెటర్లు మహిళలపై చేసిన వ్యాఖ్యలు అసభ్యకరంగా, నిస్సిగ్గుగా ఉన్నాయని, తమ వ్యాఖ్యలపై వారిద్దరూ క్షమాపణలు కోరినా సరిపోవని, వారిని సస్పెండ్ చేయాలని సీఓఏ సభ్యురాలు డయానా ఎడుల్జీ డిమాండ్ చేశారు. సీఓఏ చైర్మన్ వినోద్ రాయ్ పాండ్య, రాహుల్‌పై రెండు వనే్డల్లో నిషేధం విధించాలని అభిప్రాయపడగా, ఈ అంశాన్ని బీసీసీఐ లీగల్ సెల్‌కు పంపాలని డయానా కోరారు. అయతే, క్రికెటఠ్ల వ్యాఖ్యలు బీసీసీఐ నిబంధనల ఉల్లంఘన కిందకు రాదని చెప్పడంతో వారిని సస్పెండ్ చేశారు. కాగా, పాండ్య, రాహుల్ వ్యాఖ్యలు ఎంతమాత్రం సమర్థనీయం కావని, వీటిని టీమిండియా ఎంతమాత్రం సహించబోదని కెప్టెన్ విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు. మహిళలపై ఆ యువ ఆటగాళ్ల వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కావని, ఆ వ్యాఖ్యలు వారి వ్యక్తిగతమైనవని, వాటి ప్రభావం జట్టుపై ఏమాత్రం పడదని అంటూ వారి వ్యాఖ్యలు వారి విచక్షణకే వదిలేస్తున్నానని అన్నాడు. వీరిద్దరూ తదుపరి మ్యాచ్‌లలో ఆడేది లేనిదీ అనే విషయమై బీసీసీఐ తుది తీర్పు కోసం ఎదురు చూస్తున్నామని అన్నాడు. ఏడాది వరల్డ్ కప్ సన్నద్ధమవుతున్న తరుణంలో అత్యుత్సాహంతో ఆ ఇద్దరు క్రికెటర్లు చేసిన వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని అన్నాడు. అయినా, ఇవేమీ తమ జట్టుపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపబోవమని తాము బలంగా నమ్ముతున్నామని అన్నాడు. ఒక మ్యాచ్‌లో సస్పెన్షన్ నేపథ్యంలో శనివారం ఆస్ట్రేలియా-్భరత్ మధ్య జరిగే తొలి వనే్డలో పాండ్య, రాహుల్ ఆడేందుకు అవకాశం లేదని బీసీసీఐ అధికార వర్గాలు పీటీఐ ప్రతినిధికి తెలిపాయి. ఈ యువ బ్యాట్స్‌మెన్‌లపై ఒక మ్యాచ్‌కు సస్పెండ్ చేయడంతో వారు చేసిన వ్యాఖ్యలపై సమగ్ర విచారణ చేపడతామని సీఓఏ చైర్మన్ వినోద్ రాయ్ పీటీఐ ప్రతినిధికి తెలిపాడు.
బీసీసీఐ అంతర్గత కమిటీ లేదా అడ్‌హాక్ అంబుడ్స్‌మన్ కమిటీ దీనిపై విచారణ చేపట్టే అవకాశాలు ఉన్నాయని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. కాగా, ఇద్దరు ఆటగాళ్లు చేసిన వ్యాఖ్యలు క్రికెట్ క్రీడా నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తాయా లేదా అన్న విషయమై వ్యాఖ్యానించేందుకు బీసీసీఐ లీగల్ టీమ్ నిరాకరించింది. ఇప్పటికే టీమిండియా జట్టుతో ఆస్ట్రేలియాలో ఉన్న రాహుల్, పాండ్యను స్వదేశానికి రప్పించేందుకు, వారి స్థానంలో రిషబ్ పంత్, మనీష్ పాండ్యను తీసుకునే అవకాశం ఉందని ఆ వర్గాలు తెలిపాయి. అదేవిధంగా విజయ్ శంకర్, శ్రేయాస్ అయ్యర్‌ను జట్టులోకి తీసుకున్నా ఆశ్చర్యపడాల్సిన పని లేదని ఆ వర్గాలు పేర్కొన్నాయి.
పాండ్య స్థానే జడేజా: కోహ్లీ
ఆస్ట్రేలియాతో శనివారం జరిగే తొలి వనే్డలో తొలుత చోటుదక్కించుకుని మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సస్పెండైన యువ బ్యాట్స్‌మన్ హార్దిక్ పాండ్య స్థానంలో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు చోటుదక్కింది. పాండ్య, రాహుల్ చేసిన వ్యాఖ్యలతో తాను ఎలాంటి ఒత్తిడి గురికాలేదని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. ఇద్దరు యువ ఆటగాళ్లపై తొలి వనే్డకు నిషేధం విధించిన నేపథ్యంలో దాని ప్రభావం మ్యాచ్‌లపై ఎంతమాత్రం పడబోదని కోహ్లీ అన్నాడు. ‘ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన ఫింగర్ స్పిన్నర్, రిస్ట్ స్పిన్నర్‌తో బరిలోకి దిగాం, ఇపుడు తొలి వనే్డలో పాండ్య స్థానే జట్టులోకి తీసుకుంటున్న రవీంద్ర జడేజా కీలక భూమిక పోషించగలడని నమ్ముతాం’ అని కోహ్లీ అన్నాడు. కొన్ని సందర్భాల్లో అక్కరకు వచ్చేందుకు కొంతమంది ఆటగాళ్లను తామెప్పుడూ సిద్ధంగా ఉంచుతామని, కనుక ఆసిస్‌తో జరిగే తొలి వనే్డలో సమతూకం పాటించడం ద్వారా తాము ఎలాంటి ఒత్తిడికి గురికాబోమని స్పష్టం చేశాడు. ఇద్దరు కీలక ఆటగాళ్లను తప్పించినంతమాత్రాన దాని ప్రభావం మారిన జట్టుపై ఎలాంటి ప్రతికూల వాతావరణం చూపబోదని అన్నాడు. రానున్న వరల్డ్ కప్ కంటే ముందు ఆడేందుకు మరీ ఎక్కువ మ్యాచ్‌లు లేనందువల్ల తాము ఆటగాళ్లపై ఒత్తిడి పెంచకుండా వ్యవహరించేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నాడు. ఇందులో భాగంగానే జస్ప్రీత్ బుమ్రాపై ఒత్తిడి పెరగకుండా టెస్టు సిరీస్ తర్వాత విశ్రాంతి కల్పించామని అన్నాడు. వరల్డ్ కప్‌లో పూర్తిగా అటాక్ చేసేందుకు వీలుగా పలువురు పేసర్ల సేవలను వినియోగించుకునే ఆలోచన కూడా ఉందని అన్నాడు.
రిటైర్మెంట్ అయితే బ్యాట్ పట్టను :
విరాట్ కోహ్లీ
క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించే రోజు వస్తే ఆ తర్వాత బ్యాట్ పట్టే అవకాశం లేదని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. కొంతమంది ఆటగాళ్లు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన తర్వాత టీ-20 వంటి లీగ్ మ్యాచ్‌లలో ఆడుతున్న నేపథ్యంలో సంచలన ప్రకటన చేశాడు. క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాక ఆస్ట్రేలియా బిగ్ బాష్‌తోపాటు పలు లీగ్ మ్యాచ్‌లలో ఆడే అవకాశం ఉందా అన్న మీడియా ప్రశ్నలకు కోహ్లీ తన వైఖరిని మరోసారి స్పష్టం చేస్తూ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తే బ్యాట్ పట్టేది లేదని అన్నాడు. క్రికెట్‌లోనే ఎక్కువ కాలం కొనసాగాలని అభిలషిస్తున్నానని స్పష్టం చేశాడు. క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఏబీ డివిలియర్స్, బ్రెండన్ మెక్‌కల్లమ్ వంటివారు రెగ్యులర్‌గా టీ-20, ఐపీఎల్, బిగ్ బాష్ వంటి లీగ్‌లలో ఆడుతున్న నేపథ్యంలో తాను మాత్రం వారి జాబితాలో చేరేందుకు ఆసక్తి కనబరచడం లేదని పేర్కొన్నాడు. ‘గత ఐదేళ్ల కాలంగా నేను ఎన్నో మ్యాచ్‌లలో ఆడాను. రిటైర్మెంట్‌పై ప్రకటించే ఆలోచన ఎంతమాత్రం లేదు. ఒకవేళ అలాంటి పరిస్థితే వస్తే ఆ తర్వాత బ్యాట్‌ను ముట్టను. మైదానంలో అడుగుపెట్టను’ అని కోహ్లీ మరోసారి స్పష్టం చేశాడు.