క్రీడాభూమి

గుజరాత్ సమష్టి విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, మే 8: దినేష్ కార్తీక్ బాధ్యతాయుతంగా ఆడగా మిగతా ఆటగాళ్లు కూడా సహకరించడంతో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను గుజరాత్ లయన్స్ జట్టు ఐదు వికెట్ల తేడాతో ఓడించింది. 159 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ మరో రెండు ఓవర్లు మిగిలి ఉండగానే చేరుకుంది.
తొలుత బ్యాటింగ్ చేసిన నైట్‌రైడర్స్ 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 158 పరుగులు సాధించింది. రాబిన్ ఉతప్ప (4), గౌతం గంభీర్ (5), మనీష్ పాండే (0), సూర్యకుమార్ యాదవ్ (4) తక్కువ స్కోర్లకే అవు టైనప్పటికీ షకీబ్ అల్ హసన్ (44 బంతుల్లో 66), యూసుఫ్ పఠాన్ (41 బంతుల్లో 63) జట్టును ఆదుకున్నారు. అనంతరం బ్యాటింగ్ చేసి న గుజరాత్‌కు దినేష్ కార్తీక్ అర్ధ శతకం (51)తో అండగా నిలిచాడు. డ్వెయన్ స్మిత్ (27), బ్రెండన్ మెక్‌కలమ్ (29), ఆరోన్ ఫించ్ (29) బా ధ్యతాయుతంగా ఆడడంతో గుజరాత్ 18 ఓవర్లలో ఐదు వికెట్లకు 164 పరుగులు సాధించి, ఐదు వికెట్ల తేడాతో గెలిచింది.