క్రీడాభూమి

రోహిత్ సెంచరీ వృథా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిడ్నీ: ప్రపంచ కప్‌కు ముందు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించిన సిరీస్‌లో భారత్ మొదటి వనే్డలో తడబడింది. కీలక బ్యాట్స్‌మెన్లు విఫలమవడంతో 34 పరుగుల తేడాతో ఓడింది. ఆస్ట్రేలియాతో సిడ్నీలో శనివారం జరిగిన తొలి వనే్డలో ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా ను మూడో ఓవర్‌లోనే భువనేశ్వర్ దెబ్బతీశాడు. కెప్టెన్ ఆరోన్ పింఛ్‌ను అద్భుత బంతితో బౌల్డ్ చేసి తన వనే్డ కెరీర్‌లో 100వ వికెట్ సాధించాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఉస్మాన్ ఖాజా తో కలిసి మరో ఓపెనర్ అలెక్స్ క్యారీ స్కోరు బోర్డును పరుగు లెత్తించాడు. అప్పటికే 5 ఫోర్లు కొట్టి మంచి ఊపు మీదున్న క్యా రీ (24) కుల్దీప్ బౌలింగ్‌లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి వెనుదిరి గాడు. అప్పటికీ జట్టు స్కోరు రెండు వికెట్ల నష్టానికి 41 పరుగు లు మాత్రమే. ఈ దశలో ఖాజాతో జతకట్టిన షాన్ మార్ష్ చెలరే గి ఆడాడు. వీరిద్దరూ కలిసి 92 పరుగుల విలువైన భాగస్వా మ్యాన్ని నమోదు చేశారు. ప్రమాదకరంగా మారిన ఈ జంటను రవీంద్ర జడేజా విడదీశాడు. 28.2 ఓవర్‌లో జడేజా వేసిన బం తిని అంచనా వేయని ఉస్మాన్ ఖాజా (59) ఎల్‌బీగా వెనుదిరి గాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన పీటర్ హాండ్స్‌కాంబ్‌తో కలిసి షాన్‌మార్ష్ భారత బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఈ దశలో షాన్‌మార్ష్ (54) అర్ధ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. కెరీర్‌లో 13వ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న షాన్ మార్ష్ 37.3 ఓవర్‌లో కుల్దీప్‌యాదవ్ వేసిన బంతిని లాంగ్ ఆన్‌మీదుగా కొట్టగా మ హ్మద్ షమీ ముందుకొచ్చి క్యాచ్ పట్టాడు. పీటర్ హాండ్స్ కాంబ్ తో జతకట్టిన మార్కస్ స్టొయనిస్ వచ్చి రావడంతో వేగంగా పరుగులు రాబట్టాడు. మరోవైపు పీటర్ హాండ్స్‌కాంబ్ (73) త న కెరీర్‌లో ఆరో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఓవైపు ఓవర్లు దగ్గరపడుతున్నకొద్దీ ఆసీస్ బ్యాట్స్‌మెన్లు చెలరేగి ఆడారు. 47.2 ఓవర్‌లో భువనేశ్వర్ వేసిన బంతిని దావన్ అందుకోవడంతో అవుటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన గ్లేన్ మ్యాక్స్‌వెల్ (11) అండతో మార్కస్ స్టొయనిస్ (47) చివరి వరకు నిలిచి జ ట్టు స్కోరును ఐదు వికెట్లకు 288 పరుగులకు చేర్చారు. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్ రెండేసి వికెట్లు తీయగా, రవీంద్ర జడేజాకు ఒక వికెట్ దక్కింది.
తడబడ్డ భారత్ ..
288 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు మొదటి ఓవ ర్‌లోనే కోలుకోలేని దెబ్బ తగిలింది. శిఖర్ ధావన్ (0) ని మొదటి ఓవ ర్ చివరి బంతికి బెహ్రెన్‌డ్రఫ్ వేసిన బంతికి ఎల్‌బీగా వెనుదిరిగాడు. ఈ పర్యటనలో మంచి ఫాంలో ఉన్న రన్ మిషన్, కెప్టెన్ విరాట్ కోహ్లీ (3) క్రీజులోకి వచ్చి రాగానే జే రిచర్డ్‌సన్ బౌలింగ్‌లో స్టొయనిస్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన అంబటి రాయుడు (0)ను రెండు బంతుల వ్యవధిలోనే రిచర్డ్‌సన్ ఎల్‌బీగా పెవిలియన్‌కు పంపాడు. నాలుగు పరుగులకే మూడు వికె ట్లు కోల్పోయ పీకల్లోతు కష్టాల్లో ఉన్న భారత్‌ను మరో ఓపెనర్ రోహిత్ శర్మ ఆచితూచి ఆడుతూ గట్టెక్కించే ప్రయత్నం చేశాడు. మాజీ కెప్టెన్ మహీంద్ర సింగ్ ధోనీతో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యతను తన భుజాలపై వేసుకున్నాడు. ఈ క్రమంలో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరోవైపు చాలాకాలంగా ఫాంలే మితో తంటాలు పడుతున్నా ధనాధన్ ధోనీ ఈ మ్యాచ్‌లో నిదానంగా పరుగుల వేటను ప్రారంభించి, తన కెరీర్‌లో 68వ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వీరిద్దరూ కలిసి నాలుగో వికెట్‌కు 171 బంతుల్లోనే 137 పరుగులు చేశారు. ఈ క్రమంలో ధోనీ (68) బెహ్రెన్‌డ్రఫ్ బౌలింగ్‌లో ఎల్‌బీగా అవుటయ్యాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా, మరోవైపు హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ ఆసీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. దినేష్ కార్తీక్‌తో కలిసి చెలరేగి ఆడాడు. ఈ దశలో 110 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. రోహిత్‌కిది ఓవరాల్‌గా 22వ సెంచరీ కాగా, ఆస్ట్రేలియాపై ఏడో సెంచరీ. మరో ఎండ్‌లో నెమ్మదిగా ఆడుతున్న దినేష్ కార్తీక్ (12) రిచర్డ్‌సన్ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. ఆ తర్వాత వచ్చిన రవీంద్ర జడేజా (8)ని రిచర్డ్‌సన్ పెవిలియన్‌కు పంపాడు. అప్పటికే చేయాల్సిన పరుగులకు బంతులకు భారీగా తేడా ఉండడం, మరోవైపు టాపార్డర్ వెనువెంటనే పెవిలియన్‌కు చేరడంతో రోహిత్ శర్మ (130) భువనేశ్వర్ కుమార్‌తో కలిసి స్కోరు బోర్డు వేగం పెంచే క్రమంలో స్టొయనిస్ బౌలింగ్‌లో మ్యాక్స్‌వెల్‌కి క్యా చ్ ఇచ్చి అవుటయ్యాడు. ఆ తర్వాతి బ్యాట్స్‌మెన్లలో భువనేశ్వర్ (29 నాటౌట్) ధాటిగా ఆడినా కుల్దీప్ యాదవ్ (3), మహమ్మద్ షమీ (1) వెనువెంటనే పెవిలియన్‌కు చేరడంతో భారత్ 34 పరుగుల స్వల్ప తేడాతో ఓడింది. ఆస్ట్రేలియా బౌలర్ల లో జే రిచర్డ్‌సన్ నాలుగు వికెట్లు తీయగా, బెహ్రెన్‌డ్రఫ్, మార్కస్ స్టొయనిస్ తలో రెండు వికెట్లు, పిటర్ సిడేల్‌కు ఒక వికెట్ పడ గొట్టారు. ఈ విజయంతో ఆస్ట్రేలియా అంతర్జాతీయ క్రికెట్‌లో 1000 మ్యాచ్‌లను గెలిచిన జట్టుగా చరిత్ర సృష్టించింది.
ఆస్ట్రేలియా: అలెక్స్ క్యారీ (సీ) రోహిత్ (బీ) కుల్దీప్‌యాదవ్ 24; ఆరోన్ పింఛ్ (బీ) భువనేశ్వర్ 6; ఉస్మాన్ ఖాజా ఎల్‌బీ (బీ) రవీంద్ర జడేజా 59; షాన్ మార్ష్ (సీ) షమీ (బీ) కుల్దీప్‌యాదవ్ 54; పీటర్ హ్యాండ్స్‌కాంబ్ (సీ) ధావన్ (బీ)్భవనేశ్వర్ 73; మార్కస్ స్టొయనిస్ 47 (బ్యాటింగ్); గ్లేన్ మ్యాక్స్‌వెల్ (బ్యాటింగ్) 11. ఎక్స్‌ట్రాలు: 14;
మొత్తం: 288 (50 ఓవర్లలో 5వికెట్ల నష్టానికి)
వికెట్ల పతనం: 8-1, 41-2, 133-3, 186-4, 254-5
బౌలింగ్: భువనేశ్వర్ కుమార్ 10-0-66-2, ఖలీల్ అహ్మద్ 8-0-55-0, మహమ్మద్ షమీ 10-0-46-0, కుల్దీప్ యాదవ్ 10-0-54-2, రవీంద్ర జడేజా 10-0-48-1, అంబటి రాయుడు 2-0-13-0.
భారత్: రోహిత్ శర్మ (సీ) మ్యాక్స్‌వెల్ (బీ) స్టొయనిస్ 133; శిఖర్ ధావన్ ఎల్‌బీ (బీ) బెహ్రెన్‌డ్రఫ్ 0; విరాట్ కోహ్లీ (సీ) స్టొయనిస్ (బీ) జే రిచర్డ్‌సన్ 3; అంబటి రాయుడు ఎల్‌బీ (బీ) జే రిచర్డ్‌సన్ 0; ఎంఎస్ ధోనీ ఎల్‌బీ (బీ) బెహ్రెన్‌డ్రఫ్ 51; దినేష్ కార్తీక్ (బీ) జే రిచర్డ్‌సన్ 12; రవీంద్ర జడేజా (సీ) షాన్‌మార్ష్ (బీ) జే రిచర్డ్‌సన్ 8 ; భువనేశ్వర్ కుమార్ (బ్యాటింగ్) 29; కుల్దీప్ యాదవ్ (సీ) ఖాజా (బీ) సిడేల్ 3; మహమ్మద్ షమీ (సీ) మ్యాక్స్‌వెల్ (బీ) స్టొయనిస్ 1. ఎక్స్‌ట్రాలు: 14;
మొత్తం: 254 (50 ఓవర్లలో 9వికెట్ల నష్టానికి)
బౌలింగ్: జాసన్ బెహ్రెన్‌డ్రఫ్ 10-2-39-2, జే రిచర్డ్‌సన్ 10-2-26-4, పిటర్ సిడేల్ 8-0-48-1, నాథన్ లియాన్ 10-1-50-0, మార్కస్ స్టొయనిస్ 10-0-66-2, గ్లేన్ మ్యాక్స్‌వెల్ 2-0-18-0.

చిత్రం.. విజయానందంలో ఆస్ట్రేలియా జట్టు ఆటగాళ్లు