క్రీడాభూమి

ఆస్ట్రేలియా ఓపెన్‌పై ఫెదరర్, జొకోవిచ్ కన్ను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్‌బోర్న్: ప్రపంచ టెన్నిస్ స్టార్ దిగ్గజాలు రోజర్ ఫెదరర్, నవోక్ జొకోవిచ్ ఆస్ట్రేలియా ఓపెన్‌పై కిరీటం కైవసం చేసుకునేందుకు కనే్నశారు. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్, విక్టోరియాలో భారీ ఎత్తున ఈ ఏడాది ప్రథమార్థంలో నిర్వహిస్తున్న తొలి గ్రాండ్‌శ్లామ్ ఇదే. ఆస్ట్రేలియా ఓపెన్ నిర్వహించడం వరుసగా ఇది 107వ సారి. ఈ పోటీలు ఈనెల 14 నుంచి 27వరకు నుంచి మెల్‌బోర్న్‌లో జరుగనున్నాయి. అనారోగ్యం కారణంగా రెండు రోజుల కిందట టెన్నిస్‌కు గుడ్‌బై పలికిన ఇంగ్లాండ్ స్టార్ ఆటగాడు ఆండీ ముర్రేకు ఇదే ఆఖరి మెగా ఈవెంట్ కానుంది. ఇప్పటివరకు రెండుసార్లు వింబుల్డన్ ట్రోఫీలను ముద్దాడాడు. ప్రపంచ నెంబర్ వన్ జొకోవిచ్, మూడో సీడ్ ఫెదరర్ (డిఫెండింగ్ చాంపియన్)ను యువ సంచనం, నాలుగో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ ఈ మెగా ఈవెంట్‌లో ఛాలెంజ్ చేయనున్నాడు. ఈ అతి పెద్ద టోర్నమెంట్‌లో దిగ్గజ ఆటగాళ్లపై పైచేయి సాధించేందుకు జ్వెరెవ్ అత్యుత్సాహంతో ఉన్నాడు. గత ఆరు నెలలుగా తీవ్రమైన నొప్పితో బాధపడుతున్న ఆండీ ముర్రే రానున్న టోర్నమెంట్లలో ఆడే అవకాశం ఏకోశానా కనిపించకపోవడంతో టెన్నిస్ నుంచి రిటైరవుతున్నట్టు రెండు రోజుల కిందట మీడియా సమావేశంలో ఉద్వేగభరితంగా తెలిపాడు. వింబుల్డన్ పోటీల తర్వాత తాను పూర్తిగా టెన్నిస్ నుంచి తప్పుకోనున్నానని ముర్రే స్పష్టం చేశాడు. ఆరోగ్యం సహకరించి ఉంటే సోమవారం నుంచి జరుగనున్న వింబుల్డన్ వంటి మెగా టోర్నమెంట్‌లో దిగ్గజ ఆటగాళ్లతో పోటీ పడే అవకాశం ఉండేది. కాలినొప్పి వల్ల గత ఏడాది మెల్‌బోర్న్ టోర్నీ నుంచి వెనుతిరిగి నిరాశపరిచిన 31 ఏళ్ల జొకోవిచ్ గత ఏడాది ఏటీపీ ఫైనల్స్‌లో అలెగ్జాండర్ జ్వెరెవ్‌పై గెలుపు ద్వారా మళ్లీ తన మునుపటి ఫామ్‌ను కొనసాగించాడు. జొకోవిచ్ గత ఏడాది సెప్టెంబర్‌లో మూడోసారి యూఎస్ ఓపెన్‌లో గెలుపుతో 14 గ్రాండ్‌శ్లామ్‌లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ విజయాలతో జొకోవిచ్ అత్యధిక గ్రాండ్‌శ్లామ్‌లు గెల్చుకున్న రాఫెల్ నాదల్‌కు మూడు స్థానాలు వెనుక, ఫెదరర్‌కు ఆరు స్థానాలు ముందు నిలిచాడు. ‘నేను ఉత్తమ ఆటతీరును కనబరుస్తున్నాను. మెగా ఈవెంట్‌లో ప్రత్యర్థిపై పైచేయి సాధించగలననే నమ్మకం ఉంది’ అని అన్నాడు ఆస్ట్రేలియా ఓపెన్‌లో తలపడుతున్న మరో స్టార్ ఆటగాడు 37 ఏళ్ల స్విస్ స్టార్ ఫెదరర్.
చిత్రాలు.. నవోక్ జొకోవిచ్ *అలెగ్జాండర్ జ్వెరెవ్