క్రీడాభూమి

గెలిస్తేనే నాకౌట్ ఆశలు సజీవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొహాలీ, మే 8: అన్ని రంగాల్లోనూ పటిష్టంగా ఉండడంలోనేకాదు.. అన్ని రంగాల్లోనూ విఫలమయ్యే విషయంలోనూ రెండు జట్లు సమవుజ్జీలుగా నిలుస్తాయని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్లను చూస్తే స్పష్టమవుతుంది. పాయింట్ల పట్టికలో కింద నుంచి మొదటి రెండు స్థానాలను ఆక్రమించిన ఈ జట్లు తప్పక గెలవాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. గెలిచిన జట్టుకు ఆశలు కొంచమైనా సజీవంగా నిలుస్తాయి. ఓడిన జట్టు ఏదైనా అద్భుతం జరిగితే తప్ప నాకౌట్ చేరే అవకాశం ఉండదు. విరాట్ కోహ్లీ నాయకత్వంలోని బెంగళూరు అసాధారణంగా విజృంభిస్తుందని అంతా అనుకున్నప్పటికీ, పరిస్థితి అందుకు భిన్నంగా కొనసాగుతున్నది. కోహ్లీ ఒక్కడే అద్భుతంగా రాణిస్తున్నా, మిగతా వారు అదే స్థాయిలో ఆడలేకపోవడంతో బెంగళూరుకు సమస్యలు తప్పడం లేదు. ఈ జట్టు ఇంత వరకూ ఎనిమిది మ్యాచ్‌లు ఆడి ఆరు పాయింట్లు సంపాదించి, ఎనిమిది జట్లు ఢీ కొంటున్న టోర్నీలో ఏడో స్థానంలో ఉంది. పంజాబ్ కూడా ఆరు పాయింట్లు సంపాదించినప్పటికీ ఆ జట్టు తొమ్మిది మ్యాచ్‌లు ఆడింది కాబట్టి అట్టడుగు స్థానంలో నిలిచింది. కాగా, ఈ రెండు జట్లూ శనివారం నాటి తమతమ ప్రత్యర్థులను ఓడించి, రేసులోనే ఉన్నామన్న సంకేతాలు పంపాయి. వరుసగా మూడు పరాజయాలను చవిచూసిన తర్వాత బెంగళూరు శనివారం నాటి మ్యాచ్‌లో వీరోచితంగా పోరాడి రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్‌ను ఏడు వికెట్ల తేడాతో ఓడించింది. పంజాబ్ కూడా కడ వరకూ పోరాటాన్ని కొనసాగించి, తొమ్మిది పరుగుల తేడాతో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌పై విజయం సాధించింది.
మొత్తం మీద సోమవారం నాటి మ్యాచ్ ఇరు జట్లకు కీలకంగా మారడంతో, అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధమయ్యాయి. ఇరు జట్ల హోరాహోరీ పోరు క్రికెట్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకోవడం ఖాయం.