క్రీడాభూమి

కష్టంగా ఫెదరర్.. సులభంగా నాదల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్బోర్న్: ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్‌లో డిఫెండింగ్ చాంపియన్ రోజర్ ఫెదరర్ చెమటోడ్చి నెగ్గగా, రెండో ర్యాంక్ ఆటగాడు రాఫెల్ నాదల్ ఎలాంటి కష్టం లేకుండా, సులభంగానే ప్రత్యర్థిని ఓడించి మూడో రౌండ్ చేరాడు. క్వాలిఫయర్ డాన్ ఇవాన్స్ నుంచి తీవ్ర స్థాయిలో పోటీని ఎదుర్కొన్న ఫెదరర్ చివరికి పోరును 7-6, 7-6, 6-3 తేడాతో తన ఖాతాలో వేసుకున్నాడు. మొదటి రెండు సెట్లలో చివరి వరకూ చెమటోడ్చిన ఫెదరర్ చివరిదైన మూడో సెట్‌లో ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా విజయభేరి మోగించాడు. కాగా, నాదల్ 6-3, 6-2, 6-2 తేడాతో మాథ్యూ ఎబ్డెన్‌ను సునాయాసంగా ఓడించాడు. నాదల్ విజృంభణకు ఎబ్డెన్ నుంచి ఏ దశలోనూ గట్టిపోటీ ఎదురుకాలేదు.
ఆండర్సన్‌కు చుక్కెదురు
ప్రపంచ ఐదో ర్యాంక్ ఆటగాడు కెవిన్ ఆండర్సన్‌కు రెండో రౌండ్‌లోనే చుక్కెదురైంది. మొదటి రౌండ్‌లో బ్రిటన్ ఆటగాడు ఆండీ ముర్రే అనూహ్యంగా పరాజయాన్ని ఎదుర్కోగా, రెండో రౌండ్‌లో ఆండర్సన్ అదే విధంగా ఎవరూ ఊహించని రీతిలో ఓటమిపాలయ్యాడు. ఫ్రానె్సస్ టియాఫో 4-6, 6-4, 6-4, 7-5 తేడాతో ఆండర్సన్‌ను ఓడించాడు. 27వ ర్యాంకర్ అలెక్స్ డి మినౌర్ 6-4, 6-2, 6-7, 4-6, 6-3 ఆధిక్యంతో హెన్రీ లాక్సోనెన్‌పై గెలుపొంది మూడో రౌండ్‌లోకి అడుగుపెట్టాడు. హోరాహోరీగా సాగిన ఈ ఆమ్యాచ్ చివరి వరకూ ప్రేక్షకులను ఉర్రూతలూగించింది.