క్రీడాభూమి

షరపోవా ముందంజ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రష్యా టెన్నిస్ బ్యూటీ మరియా షరపోవా మహిళల సింగిల్స్‌లో ముందంజ వేసింది. రెండో రౌండ్‌లో ఆమె రెబెకా పెటెర్సన్‌ను 6-2, 6-1 తేడాతో చిత్తుచేసింది. 30వ ర్యాంక్ క్రీడాకారిణిగా బరిలోకి దిగిన ఆమెకు టైటిల్ సాధించే అవకాశాలు చాలా తక్కువగానే ఉన్నప్పటికీ, ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఆమె నంబర్ వన్‌గా నిలిచింది. కాగా, ఐదో ర్యాంక్ క్రీడాకారిణి స్లొయెన్ స్టెఫెన్స్ 6-3, 6-1 ఆధిక్యంతో తిమియా బబోస్‌ను ఓడించి మూడో రౌండ్‌లోకి అడుగుపెట్టింది. ఆషే బార్టీ 6-2, 6-3 స్కోరుతో వాంగ్ యఫాన్‌పై గెలుపొందింది. రెండో ర్యాంక్ క్రీడాకారిణి ఎంజెలిక్ కెర్బర్ 6-2, 6-3 స్కోరుతో క్వాలిఫయర్ బిట్రిజ్ హదాద్ మలాపై గెలుపొందింది. అనస్టాసియా పవ్లిచెన్కో 3-6, 6-3, 6-3 తేడాతో తొమ్మిదో సీడ్ కికీ బెర్టిన్స్‌ను, మూడో ర్యాంకర్ కరోలినా వొజ్నియాకి 6-1, 6-3 ఆధిక్యంతో జొహన్నా లార్సన్‌ను ఓడించి మూడో రౌండ్‌లోకి ప్రవేశించారు.