క్రీడాభూమి

షరపోవా చేతిలో వొజ్నియా ఔట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్బోర్న్, జనవరి 18: ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ మహిళల సింగిల్స్‌లో మూడో ర్యాంక్ క్రీడాకారిణి కరోలిన్ వొజ్నియాకికి రష్యా బ్యూటీ మరియా షరపోవా షాకివ్వగా, రెండో ర్యాంకర్ ఏంజెలిక్ కెర్బర్ ముందంజ వేసింది. మూడో రౌండ్‌లో వొజ్నియాకిని 6-4, 4-6, 6-3 తేడాతో ఓడించిన షరపోవా ప్రీ క్వార్టర్ ఫైనల్స్ చేరింది. కాగా, ఏంజెలిక్ కెర్బర్ అద్వితీయ ఫామ్‌ను కొనసాగిస్తూ మూడో రౌండ్‌లో తన ప్రత్యర్థి కింబర్లీ బిరెల్‌ను 6-1, 6-0 తేడాతో చిత్తుచేసింది. 15వ సీడ్‌గా బరిలోకి దిగిన ఆష్లే బార్టీ 7-5, 6-1 స్కోరుతో మరియా సకారీపై విజయం సాధించింది. 11వ ర్యాంక్ క్రీడాకారిణి అరినా సబలెన్కా 3-6, 2-6 తేడాతో అమందా అనిసిమొవా చేతిలో పరాజయాన్ని ఎదుర్కొంది. ఐదో ర్యాంకర్ స్లొయేన్ స్టెఫెన్స్ 7-6, 7-6 ఆధిక్యంతో పెట్రా మార్టిక్‌పై గెలుపొందింది. 19వ ర్యాంక్ క్రీడాకారిణి కరోలిన్ గార్సియాను డానియెల్ కొలిన్స్ 6-3, 6-2 తేడాతో ఓడించి ప్రీ క్వార్టర్స్ చేరింది. అనస్టాషియా పవ్లిచెన్కొవా 6-0, 6-3 తేడాతో అలక్సాండ్రా సస్నోవిచ్‌పై, ఎనిమిదో సీడ్ పెట్రా క్విటోవా 6-1, 6-4 తేడాతో బెలిండా బెన్సిక్‌పై విజయాలను నమోదు చేశారు.