క్రీడాభూమి

ఓడితే రైజింగ్ పుణె ఇంటికే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం (స్పోర్ట్స్), మే 9: పరిమిత ఓవర్ల ఫార్మెట్స్‌లో టీమిండియాకు నాయకత్వం వహిస్తున్న మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో, తొలిసారి ఐపిఎల్‌లోకి అడుగు పెట్టిన రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్ టోర్నీ నుంచి నిష్క్రమించే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నది. మంగళవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగే మ్యాచ్‌లో ఓడితే ఇంటి దారి పట్టక తప్పదు. ఈ మ్యాచ్ ఒక్కటే కాదు.. ఇకపై జరిగే అన్ని మ్యాచ్‌లు పుణె జట్టుకు కీలకమే. న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ స్ట్ఫిన్ ఫ్లెమింగ్ కోచ్‌గా వ్యవహరిస్తున్న ఈ జట్టు ఇప్పటి వరకూ పది మ్యాచ్‌లు ఆడి, కేవలం మూడు విజయాలను నమోదు చేసింది. ఏడు పరాజయాలను చవిచూసింది. వీటిలో నాలుగు హోం గ్రౌండ్‌లో ఎదురైనవే. అయితే, ముంబయి ఇండియన్స్, ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తోపాటు సన్‌రైజర్స్‌పైనా పుణె విజయం సాధించింది. ఆ విజయాన్ని గుర్తుచేసుకొని, డేవిడ్ వార్నర్ నేతృత్వంలోని ఆ జట్టును మరోసారి ఓడించాలన్న పట్టుదలతో ఉంది. అయితే, అసాధారణ ఫామ్‌ను కొనసాగిస్తూ, ఇప్పటి వరకూ ఆడిన తొమ్మిది మ్యాచ్‌ల్లో కేవలం మూడింటిని చేజార్చుకొని, ఆరు విజయాలు సాధించిన సన్‌రైజర్స్‌ను ఓడించడం సులభం కాదన్నది వాస్తవం. దీనికితోడు ఫఫ్ డు ప్లెసిస్, కెవిన్ పీటర్సన్, స్టీవెన్ స్మిత్, మిచెల్ మార్ష్ వంటి స్టార్ ఆటగాళ్లు గాయాల కారణంగా టోర్నీకి దూరం కావడం పుణెను చావు దెబ్బతీస్తున్నది. ఉస్మాన్ ఖాజా, జార్జి బెయిలీ జట్టుతో చేరినప్పటికీ, వారు ఇంకా నిలదొక్కుకోలేదు. పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉన్న కారణంగా, మంగళవారం నాటి మ్యాచ్‌సహా ఇకపై ఆడే ప్రతి మ్యాచ్‌లోనూ పుణె సర్వశక్తులు ఒడ్డి పోరాడి, గెలవాలి. ఏ మ్యాచ్‌ని చేజార్చుకున్నా టోర్నీ నుంచి నిష్క్రమించక తప్పదు. మ్యాచ్‌లు గెలవడం ధోనీ బృందానికి అసాధ్యం కాకపోయినా, కీలక విభాగాల్లో ఎదుర్కొంటున్న లోటుపాట్లను సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. బ్యాటింగ్‌లో ఆజింక్య రహానే తప్ప ఎవరూ చెప్పుకోతగ్గ స్థాయిలో ఆడడం లేదు. రహానే ఇప్పటి వరకూ 417 పరుగులు చేసి, ఎక్కువ పరుగులు సాధించిన బ్యాట్స్‌మెన్ జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. ధోనీ ఇంకా తనను తాను నిరూపించుకోలేదు. మిగతా వారిపై ఎవరికీ ఎక్కువ అంచనాలు లేదు. కాగా, బౌలింగ్ విభాగాన్ని చూస్తే బ్యాటింగ్ కొంత మేలనిపిస్తుంది. పుణె బౌలర్లు వేస్తున్న బంతుల్లో పదును లోపించింది. అంతర్జాతీయ క్రికెట్‌లో ఎంతో అనుభవం ఉన్న ఇశాంత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్, ఇర్ఫాన్ పఠాన్, తిసర పెరెరా తదితరులు కూడా సత్తా చాటలేకపోతున్నారు. వీరంతా తమ స్థాయికి తగినట్టు ఆడితే తప్ప సన్‌రైజర్స్‌ను ఓడించడం ధోనీ సేనకు సాధ్యం కాదు.
డేవిడ్ వార్నర్, శిఖర్ ధావన్, ఇయాన్ మోర్గాన్, భువనేశ్వర్ కుమార్ వంటి కొంత మందిని మినహాయిస్తే, గొప్పగొప్ప స్టార్లు ఎవరూ లేకపోయినా, ప్రతి ఒక్కరూ ఎంతో క్రమశిక్షణతో ఆడడం సన్‌రైజర్స్‌కు లాభిస్తున్న అంశం. కెప్టెన్ వార్నర్ తాను స్వయంగా రాణిస్తూ స్ఫూర్తిదాయంగా నిలుస్తున్నాడు. శిఖర్ ధావన్ మళ్లీ ఫామ్‌లోకి రావడం సన్‌రైజర్స్ బలాన్ని పెంచుతున్నది. మోజెస్ హెన్రిక్స్ ఆల్‌రౌండ్ ప్రతిభ కనబరుస్తున్నాడు. దాదాపుగా జట్టులోని అందరూ కలిసి సమష్టిగా చేస్తున్న పోరాటం సన్‌రైజర్స్‌ను విజయాల బాటలో నడిపిస్తున్నది. మంగళవారం నాటి మ్యాచ్‌లోనూ ఈ జట్టు హాట్ ఫేవరిట్‌గా బరిలోకి దిగనుంది.

చిత్రం బౌలర్ ఇశాంత్ శర్మ (ఎడమ), బ్యాట్స్‌మన్ ఆజింక్య రహానే (కుడి)కి సూచనలిస్తున్న రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్ చీఫ్ కోచ్ స్ట్ఫిన్ ఫ్లెమింగ్