క్రీడాభూమి

పాండ్య, రాహుల్‌ను ఆడనివ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 19: టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనలో పాల్గొన్న యువ క్రికెటర్లు హార్దిక్ పాండ్య, కేఎల్ రాహుల్ మహిళలను కించపరుస్తూ ఒక టీవీ చానెల్‌లో చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించిన నేపథ్యంలో బీసీసీఐ యాక్టింగ్ ప్రెసిడెంట్ సీకే ఖన్నా వారికి ఇపుడు మద్దతు ప్రకటించేలా మాట్లాడాడు. ఆ ఇద్దరు క్రికెటర్లపై విచారణ జరుగుతోందని కనుక వారిని ఆడనివ్వాలని కోరుతూ కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ (సీఓఏ)కు విజ్ఞప్తి చేశాడు. అంతేకాకుండా వారిపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని సూచించాడు. ఆ క్రికెటర్లు చేసిన అభ్యంతరకమైన వ్యాఖ్యలపై చర్చించేందుకు ప్రత్యేక సర్వసభ్య సమావేశం నిర్వహించేందుకు ఆయన నిరాకరించాడు. పాండ్య, రాహుల్ వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని పలువురు బోర్డు డైరెక్టర్లు చేసిన వాదనతో ఆయన ఏకీభవించలేదు. ‘ఆ ఇద్దరు క్రికెటర్లు తప్పుచేశారు. పర్యవసానంగా ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు సిరీస్‌లో ఆడకుండా వెనుకకు తిరిగి వచ్చారు. తమ వ్యాఖ్యలపై క్షమాపణ సైతం వారు కోరారు’ అని బీసీసీఐ యాక్టింగ్ ప్రెసిడెంట్ సీకే ఖన్నా కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్‌కు లాసిన ఒక లేఖలో పేర్కొన్నాడు. ‘పాండ్య, రాహుల్‌పై విచారణ జరుగుతోంది కనుక వారిని త్వరలో న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌లలో ఆడేందుకు వీలుగా తక్షణం టీమిండియా జట్టులోకి తీసుకోండి’ అని ఖన్నా సూచించాడు. ఇద్దరు క్రికెటర్ల వ్యవహారంపై అంబుడ్స్‌మన్‌ను నియమించాలని సీఓఏ సుప్రీంకోర్టును కోరిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌తోపాటు వనే్డ ఇంటర్నేషనల్ సిరీస్‌కు సైతం పాండ్య, రాహుల్‌కు చోటు దక్కలేదు.
ఇపుడు వారిపై సరైన నిర్ణయం తీసుకోకుంటే త్వరలో జరిగే న్యూజిలాండ్ టూర్‌కు సైతం మిస్సవుతారని బీసీసీఐ యాక్టింగ్ ప్రెసిడెంట్ సీకే ఖన్నా అభిప్రాయపడ్డాడు. ఇదిలావుండగా, ఇద్దరు క్రికెటర్ల అంశంపై చర్చించేందుకు వీలుగా ప్రత్యేక సర్వసభ్య సమావేశం నిర్వహించాలని బీసీసీఐ ట్రెజరర్ అనిరుధ్ చౌదరి సైతం బీసీసీఐ యాక్టింగ్ ప్రెసిడెంట్ ఖన్నాను కోరాడు. బీసీసీఐ నిబంధనల ప్రకారం వార్షిక సర్వసభ్య సమావవేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం అంబుడ్స్‌మన్‌ను నియమించే అవకాశం ఉంది. కాగా, పాండ్య, రాహుల్ అంశం ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉన్న నేపథ్యంలో ఖన్నా లేదా అమితాబ్ చౌదరి ప్రత్యేక సర్వసభ్య సమావేశం నిర్వహించాలన్న నోటీస్‌పై ఎందుకు సంతకాలు చేశారో అర్ధం కావడం లేదని, ఇది కోర్టు ఆదేశాలను ధిక్కరించినట్టు అవుతుందని సీనియర్ బీసీసీఐ అధికారి ఒకరు పీటీఐ ప్రతినిధికి తెలిపాడు.