క్రీడాభూమి

సెరెనా, ఒసాకా, హాలెప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్‌బోర్న్, జనవరి 19: ఆస్ట్రేలియా ఓపెన్ టోర్నమెంట్ మహిళల విభాగంలో శనివారం జరిగిన మూడోరౌండ్‌లో యూఎస్ ఓపెన్ చాంపియన్ నవొమి ఒసాకా, అమెరికా స్టార్, వరల్డ్ నెంబర్ 16 క్రీడాకారిణి సెరెనా విలియమ్స్, వరల్డ్ నెంబర్ వన్ సిమోనా హాలెప్ ప్రీ క్వార్టర్ ఫైనల్స్‌లో చోటు దక్కించుకున్నారు. సెరెనా విలియమ్స్ తన ప్రత్యర్థి డయానా యస్ట్రెమ్‌స్కాను 6-2, 6-1 తేడాతో ఓడించగా, వరల్డ్ నెంబర్ 4 క్రీడాకారిణి నవొమి ఒసాకా 5-7, 6-4, 6-1 తేడాతో ప్రత్యర్థి షీ సు వెయ్‌ని ఓడించింది. అదేవిధంగా వరల్డ్ నెంబర్ వన్ సిమోనా హలెప్ అమెరికా స్టార్ క్రీడాకారిణి వీనస్ విలియమ్స్‌ను 6-2, 6-3 తేడాతో ఓడించింది. మరో పోటీలో వరల్డ్ నెంబర్ 6వ క్రీడాకారిణి ఎలినా స్విటొలినా ఝాంగ్ షువాల్ అనే క్రీడాకారిణిని 4-6, 6-4, 7-5 తేడాతో ఓడించింది. ఇక పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ నెంబర్ వన్ ఆటగాడు నవొక్ జొకోవిచ్ తన సమీప ప్రత్యర్థి వరల్డ్ నెంబర్ 25ను 6-3, 6-4, 4-6, 6-0తో ఓడించి పూర్తి ఆధిపత్యం చెలాయించి ప్రీ క్వార్టర్ ఫైనల్స్‌లోకి చేరుకున్నాడు. మరో పోటీలో ప్రపంచ నెంబర్ 3వ క్రీడాకారుడు అలెగ్జాండర్ జ్వెరెవ్ 6-3, 6-3, 6-2తో తన సమీప ప్రత్యర్థి అలెక్స్ బోల్ట్‌ను మట్టికరిపించాడు. మరో పోటీలో వరల్డ్ నెంబర్ 8 క్రీడాకారుడు కీ నిషికొరి తన ప్రత్యర్థి జొయావో సౌసాను 7-6, 6-1, 6-2తో ఓడించాడు.