క్రీడాభూమి

వనే్డల్లో కోహ్లీ గొప్ప ఆటగాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 20: వనే్డ ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఎప్పుడు ఆడినా అందులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ గొప్ప ఆటగాడిగా నిలుస్తాడని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ అన్నాడు. క్రికెట్ ప్రపంచంలో నెంబర్ వన్‌గా నిలిచిన కోహ్లీ నాయకత్వంలో ఇటు టెస్టుల్లోనూ, అటు వనే్డల్లోనూ ఉత్తమ ఆటగాడిగా నిలవడం వల్లే ఆసిస్ టూర్‌లో టీమిండియా ఇటీవల ఈ సిరీస్‌లను కైవసం చేసుకోవడంతోపాటు టీ-20 ఇంటర్నేషనల్ సిరీస్‌ను డ్రా చేసుకుని సగర్వంగా నిలిచిందని అన్నాడు. ఆసిస్ మైదానంపై ఆడిన మొత్తం సిరీస్‌లలో ఘన విజయాన్ని నమోదు చేసుకున్న తొలి జట్టుగా కోహ్లీ సేన చరిత్రలో చోటుదక్కించుకుందని పేర్కొన్నాడు. ‘నా వ్యక్తిగత విషయానికొస్తే వనే్డ క్రికెట్ ఎప్పుడు, ఎక్కడ జరిగినా అందులో ఉత్తమంగా కోహ్లీ రాణిస్తున్నాడు. ఆసిస్ గడ్డపై కోహ్లీ టీమిండియాను గెలిపించిన ఘనతే ఇందుకు నిదర్శనం’ అని వరల్డ్ కప్ మాజీ కెప్టెన్ క్లార్క్ పీటీఐ ప్రతినిధితో మాట్లాడుతూ అన్నాడు. 219 వనే్డ మ్యాచ్‌లలో 10,385 పరుగులు, వీటిలో 39 సెంచరీలు కొట్టిన 30 ఏళ్ల కోహ్లీ తన దేశం కోసం సాధించిన ఘనతను, ఆతని అభిరుచులను గౌరవించాలని అభిప్రాయపడ్డాడు. కోహ్లీకి కాస్త కోపం ఎక్కువ అన్న మాట వాస్తవమైనా ఆటలో అతని నిబద్ధతను ఎవరూ ప్రశ్నించలేరని క్లార్క్ అన్నాడు.