క్రీడాభూమి

డిఫెండింగ్ చాంపియన్ ఫెదరర్, షరపోవాకు షాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్‌బోర్న్, జనవరి 20: ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ పురుషుల విభాగంలో భాగంగా ఆదివారం జరిగిన నాలుగో రౌండ్‌లో డిఫెండింగ్ చాంపియన్ రోజర్ ఫెదరర్, మహిళల విభాగంలో రష్యా బ్యూటీ మరియా షరపోవాకు గట్టి షాక్ తగిలింది.
ప్రపంచ మూడో సీడ్ ఆటగాడు ఫెదరర్ తన సమీప ప్రత్యర్థి, తనకంటే 17 ఏళ్లు చిన్నవాడైన 20 ఏళ్ల గ్రీక్ ఆటగాడు, 14వ సీడ్ క్రీడాకారుడు స్ట్ఫెనోస్ సిట్‌సిపాస్ చేతిలో పరాజయం పాలయ్యాడు. వీరిద్దరి మధ్య క్వార్టర్ ఫైనల్స్‌లో చోటు కోసం జరిగిన పోరులో స్ట్ఫెనోస్ 6-7 (11-13), 7-6 (7/3), 7-5, 7-6 (7/5) తేడాతో ఓడించాడు.
గ్రీక్ చరిత్రలోనే తొలిసారిగా గ్రాండ్ శ్లామ్‌లో క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్న ఘనతను స్ట్ఫెనోస్ సాధించాడు. మహిళల సింగిల్స్ నాలుగో రౌండ్‌లో ఎనిమిదో సీడ్ పెట్రా క్విటోవా, ఆష్‌లీగ్ బార్టీ, డేనియల్లీ కొలిన్స్ సునాయాసంగా క్వార్టర్ ఫైనల్స్‌లో ప్రవేశించారు. వేర్వేరు పోటీల్లో పెట్రా క్విటోవా తన సమీప ప్రత్యర్థి అమందా అనిసిమోవాను 6-2, 6-1 తేడాతో ఓడించగా, 15వ సీడ్ ఆష్‌లీగ్ బార్టీ సీనియర్ క్రీడాకారిణి మారియా షరపోవాను 4-6, 6-1, 6-4 తేడాతో ఓడించింది. షరపోవాపై విజయంతో బార్టీ తొలిసారిగా గ్రాండ్ శ్లామ్ టోర్నమెంట్‌లో క్వార్టర్ ఫైనల్స్‌లో చోటుదక్కించుకుంది. తొలిరౌండ్‌లో ప్రత్యర్థికి గట్టి పోటీనిచ్చిన షరపోవా మిగిలిన రెండు రౌండ్లలో వెనుకంజ వేయడంతో బార్టీ క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకుంది. మరోపోటీలో డేనియల్లీ కొలిన్స్ ప్రపంచ రెండో సీడ్, జర్మనీ వింబుల్డన్ చాంపియన్, ఏంజలిక్వె కెర్బర్‌ను 6-0, 6-2 తేడాతో అతి సునాయాసంగా ఓడించింది.
ఈ పోటీలో కెర్బర్ తన ప్రత్యర్థికి ఏకోశానా గట్టి పోటీ ఇవ్వలేకపోయింది. పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ నెంబర్ 2 స్టార్, 17సార్లు గ్రాండ్ శ్లామ్ టైటిళ్లు సాధించిన స్పానిష్ దిగ్గజం రాఫెల్ నాదల్ తన సమీప ప్రత్యర్థి, అన్‌సీడెడ్ క్రీడాకారుడు థామస్ బెర్డిచ్‌ను 6-0, 6-1, 7-6తో ఓడించాడు. ఈ పోటీలో బెర్డిచ్ ఎలాంటి ప్రతిఘటన ఇవ్వలేకపోవడంతో నాదల్ అతి సులువుగా క్వార్టర్ ఫైనల్స్‌లోకి ప్రవేశించాడు. మరో పోటీలో 22వ సీడ్ రాబెర్టో బాటిస్టా అగట్ తన సమీప ప్రత్యర్థి, ఆరో సీడ్ ఆటగాడు మారిన్ సిలిస్‌ను 6-7, 6-3, 6-2, 4-6, 6-4 తేడాతో ఓడించాడు. మరో పోటీలో ఫ్రానె్సస్ టియాఫో 20వ సీడ్ ఆటగాడు గ్రిగర్ దిమిట్రొవ్‌ను 7-5, 7-6, 6-7, 7-5 తేడాతో ఓడించి క్వార్టర్ ఫైనల్స్‌లో ప్రవేశించాడు.

చిత్రం..గ్రీక్ ఆటగాడు, 14వ సీడ్ స్ట్ఫెనోస్ సిట్‌సిపాస్ చేతిలో
పరాజయం పాలైన డిఫెండింగ్ చాంపియన్ రోజర్ ఫెదరర్
*15వ సీడ్ ఆష్‌లీగ్ బార్టీ చేతిలో ఓడిపోయి న మరియా షరపోవా