క్రీడాభూమి

లంకపై టెస్టు సిరీస్ మాదే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, మే 9: ఇంగ్లాండ్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను తామే గెల్చుకుంటామని ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ ధీమా వ్యక్తం చేశాడు. మూడు టెస్టులు, ఐదు వనే్డలు, ఒక టి-20 మ్యాచ్‌లు ఆడేందుకు ఇంగ్లాండ్ వచ్చిన శ్రీలంకను ఎదుర్కోవడానికి సహచరులతో కలిసి ఆండర్సన్ నెట్స్‌లో శ్రమిస్తున్నాడు. 2014లో లంక జట్టు ఇంగ్లాండ్‌లో పర్యటించినప్పుడు రెండు టెస్టులు ఆడింది. లార్డ్స్ మైదానంలో జరిగిన మొదటి టెస్టు డ్రాకాగా, లీడ్స్‌లో రెండో టెస్టును 100 పరుగుల తేడాతో గెల్చుకొని, సిరీస్‌ను 1-0 తేడాతో సొంతం చేసుకుంది. రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 350 పరుగుల విజయ లక్ష్యాన్ని చేదించేందుకు ఆటను మొదలు పెట్టిన ఇంగ్లాండ్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి కేవలం 57 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. చివరి రోజున పోరాటాన్ని కొనసాగించిన ఇంగ్లాండ్ 97వ ఓవర్ నాలుగో బంతికి తొమ్మిదో వికెట్ కోల్పోయింది. అప్పటికి మోయిన్ అలీ సెంచరీకి చేరువలో ఉన్నాడు. ఆ ఓవర్‌లోని మిగతా రెండు బంతులతోపాటు, మరో 20 ఓవర్లు పూర్తి కావాల్సి ఉండగా, మోయిన్ అలీతో కలిసి మ్యాచ్‌ని డ్రా చేసే బాధ్యత ఆండర్సన్‌పై పడింది. అతను కూడా చివరి వరకూ వికెట్ కూలకుండా జాగ్రత్త పడ్డాడు. బంతులు మింగేస్తూ, ఇంగ్లాండ్ బౌలర్లకు చికాకు తెప్పించాడు. మోయిన్ అలీ సెంచరీ పూర్తి చేయడానికి సహకరించాడు. చివరి ఓవర్‌ను బౌల్ చేసేందుకు షామిందా ఎరాంగ వచ్చినప్పుడు, మ్యాచ్ డ్రా కావడం ఖాయమని అందరూ అనుకున్నిరు. అప్పటికి 76 బంతులు ఎదుర్కొన్న ఆండర్సన్ ఒక్క పరుగు కూడా చేయకుండా, ఇంగ్లాండ్ విజయానికి సైంధవుడిలా అడ్డుపడ్డాడు. చివరి ఓవర్‌లో నాలుగు బంతులను అతను పూర్తి రక్షణాత్మకంగా ఆడాడు. ఐదో బంతి అతని బ్యాట్‌కు తగిలి అనూహ్యంగా రంగన హెరాత్ ఫీల్డింగ్ చేస్తున్న స్థానానికి వెళ్లింది. అతను ఎలాంటి పొరపాటు చేయకుండా క్యాచ్ అందుకోవడంతో ఐదో బంతిలో ఆండర్సన్ అవుటై, కన్నీరు పెట్టుకొని మైదానం నుంచి బయటకు నడిచాడు.
ఎవరూ ఊహించని విధంగా శ్రీలంక విజయం సాధించింది. ఎంతో ఆసక్తిని రేపిన నాటి మ్యాచ్ తనను ఎంతో నిరాశకు గురి చేసిందని, చివరి రెండు బంతులను ఎదుర్కొని ఉంటే, సిరీస్ డ్రా అయ్యేదని ఆండర్సన్ వాపోయాడు. ఈనెల 19 నుంచి లీడ్స్ మైదానంలోనే మొదటి టెస్టు ఆరంభమవుతున్న నేపథ్యంలో, రెండేళ్ల క్రితం నాటి మ్యాచ్‌ని గుర్తుచేసుకుంటూ, అలాంటి ఫలితం పునరావృతం కాదన్న నమ్మకం తనకు ఉందన్నాడు. లంకను ఎదుర్కోవడానికి తాము అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నామని తెలిపాడు. ఈసారి టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకొని, లంకతో లెక్కను సరి చేస్తామని వ్యాఖ్యానించాడు. టెస్టు సిరీస్ కోసం తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని అన్నాడు. విజయమే తమ లక్ష్యమని పేర్కొన్నాడు.

చిత్రం ఇంగ్లాండ్ సీనియర్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్