క్రీడాభూమి

ముగిసిన రాష్ట్ర స్థాయి కుస్తీ పోటీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం: రాజమహేంద్రవరం ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో గత మూడు రోజులుగా జరిగిన రాష్ట్ర స్థాయి బాల, బాలికల కుస్తీ పోటీలు ఆదివారంతో ముగిశాయి. సబ్ జూనియర్స్, జూనియర్స్ విభాగాల్లో జరిగిన ఈ పోటీల్లో క్రీడాకారులు తమ ప్రతిభను కనబర్చారు. ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల నుంచి 450 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. 16 సంవత్సరాల్లోపు బాల బాలికలను సబ్ జూనియర్స్‌గాను, 19 సంవత్సరాల్లోపు బాల బాలికలను జూనియర్స్ కేటగిరీగా జరిగాయి. వీరిలో 24 మంది గోల్డ్ మెడల్స్, 25 మంది సిల్వర్ మెడల్స్, 48 సాధారణ మెడల్స్‌ను గెలుపొందారు. పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులందరికీ సర్ట్ఫికేట్లు అందించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కుస్తీ జట్టుగా సబ్ జూనియర్స్ విభాగం నుంచి 30 మంది, జూనియర్స్ విభాగం నుంచి 30 మంది క్రీడాకారులను ఎంపిక చేశారు. సబ్ జూనియర్స్ జట్టును ఫిబ్రవరి 10 నుంచి 20 వరకు కటక్‌లో జరిగే ఆల్ ఇండియా రెజిలింగ్ టోర్నమెంట్‌లో, జూనియర్స్ జట్టు ఫిబ్రవబరి 1 నుంచి 4వ తేదీ వరకు సూరత్‌లో జరిగే ఆల్ ఇండియా రెజిలింగ్ టోర్నమెంట్‌లో పాల్గొంటుంది. ఆదివారం జరిగిన ముగింపు కార్యక్రమంలో నన్నయ వర్సిటీ వైస్-్ఛన్సలర్ ఆచార్య రామకృష్ణారావు, రెక్టార్ ఆచార్య పి సురేష్ వర్మ, రిజిస్ట్రార్ ఆచార్య ఎస్ టేకి, ఆంధ్రప్రదేశ్ రెజ్లింగ్ అసోసియేషన్ సంఘం అధ్యక్షుడు ఆర్‌కె పురుషోత్తం, కార్యదర్శి డాక్టర్ జి ఎలీషాబాబు, వివిధ జిల్లాల కోచ్‌లు తదితరులు పాల్గొన్నారు.