క్రీడాభూమి

రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రేచల్ చటర్జీకి గోల్డ్‌మెడల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 21: ఐఏఎస్ అధికారి (రిటైర్డ్) రేచల్ చటర్జీకి ముంబయి మారథాన్-2019లో (65-69 ఏజ్ గ్రూప్) గోల్డ్ మెడల్ లభించింది. ముంబయి మారథాన్ దేశంలో ప్రతిష్టాత్మకమైన ఈవెంట్‌గా పేరుంది. 42.195 కిలోమీటర్ల దూరం ఆమె 4 గంటల 45 నిమిషాల్లో పరుగెత్తింది. గతంలో కూడా నాలుగు పర్యాయాలు ఆమె ముంబయ మారథాన్‌లో గోల్డ్ మెడల్ సంపాదించారు. చిన్నప్పటి నుండి కూడా రేచల్ చటర్జీ క్రీడల్లో పాల్గొంటూ అనేక విజయాలు సాధించారు. సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్‌సీ), ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ, వ్యవసాయ శాఖ మాజీ చైర్మన్, సాంఘిక సంక్షేమ శాఖ ప్రత్యేక చీఫ్ సెక్రెటరీగా చటర్జీ పనిచేసి పదవీ విరమణ చేశారు.
చిత్రం..ముంబయి మారథాన్‌లో రేచల్ చటర్జీ