క్రీడాభూమి

మరో మైలురాళ్లను అధిగమించనున్న కోహ్లీ, ధోనీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూజిలాండ్, జనవరి 21: ప్రస్తుతం న్యూజిలాండ్ టూర్‌లో ఉన్న టీమిండియా ఆటగాళ్లలో కెప్టెన్ విరాట్ కోహ్లీ, మాజీ కెప్టెన్, సీనియర్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ మరో మైలురాళ్లను అధిగమించనున్నారు. ఈనెల 23 నుంచి భారత్ కివీస్ జట్టుతో ఐదు వనే్డ ఇంటర్నేషనల్ మ్యాచ్‌లలో తలపడనుంది. న్యూజిలాండ్‌తో జరిగిన వనే్డల్లో అత్యధిక సెంచరీలు సాధించిన రికార్డు భారత బ్యాట్స్‌మన్‌గా ఇప్పటివరకు సీనియర్ ఆటగాడు వీరేంద్ర సెవాగ్ 6 సెంచరీలు, 5 అర్ధ సెంచరీలతో 1157 పరుగులు చేశాడు. కివీస్‌పై కోహ్లీ ఇప్పటివరకు ఐదు శతకాలు నమోదు చేశాడు. భారత క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ సచిన్ తెండూల్కర్ కివీస్‌పై వనే్డల్లో అత్యధికంగా 1750 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఇందులో 5 శతకాలు, 8 అర్థ సెంచరీలు ఉన్నాయి. కోహ్లీ ఐదు శతకాలు, ఐదు అర్ధ సెంచరీలతో 1154 పరుగులు చేశాడు. సెవాగ్ రికార్డుకు మరో మూడు పరుగుల దూరంలో కోహ్లీ ఉన్నాడు. కివీస్‌తో సెవాగ్ సాధించిన పరుగులతోపాటు శతకాలను కూడా ఇపుడు కెప్టెన్ విరాట్ కోహీ ల దాటే అవకాశం ఉంది.
సచిన్ రికార్డును బద్దలు కొట్టనున్న మహీ
టీమిండియా మాజీ కెప్టెన్, ప్రస్తుతం న్యూజిలాండ్‌లో భారత జట్టు తరఫున ఆడనున్న మహేంద్ర సింగ్ ధోనీ క్రికెట్ దిగ్గజం సచిన్ తెండూల్కర్ రికార్డును సవరించనున్నాడు. కివీస్ గడ్డపై సచిన్ ఆడిన 18 మ్యాచ్‌లలో 652 పరుగులతో తొలి స్థానంలో నిలబడగా, ఆ తర్వాత వీరేంద్ర సెవాగ్ 12 మ్యాచ్‌లలో 598 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. ధోనీ 10 మ్యాచ్‌లలో 456 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు. అంటే సచిన్ చేసిన పరుగులకు కేవలం 197 పరుగుల దూరంలో మహీ ఉన్నాడు. కివీస్ టూర్‌లో భారత్ ఐదు వనే్డ మ్యాచ్‌లు ఆడనున్న నేపథ్యంలో సచిన్ రికార్డును ధోనీ సవరించే అవకాశం ఉంది. ఇటీవల ఆస్ట్రేలియాతో టూర్‌లో భాగంగా వనే్డ సిరీస్‌లో ఆడిన ధోనీ మూడు మ్యాచ్‌లలో అర్ధ సెంచరీలతో బాగా రాణించిన విషయం తెలిసిందే.