క్రీడాభూమి

సరిలేరు నీకెవ్వరూ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్, జనవరి 22: భారత క్రికెట్ జట్టు పరుగుల యంత్రం, రికార్డుల రారాజు, 30 ఏళ్ల కెప్టెన్ విరాట్ కోహ్లీ తన ఖాతాలో మరో అరుదైన ఘనతను అందుకున్నాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మంగళవారం ప్రకటించిన వార్షిక అవార్డుల్లో ఏకంగా మూడు అవార్డులు (ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్, ఐసీసీ టెస్టు క్రికెటర్ ఆఫ్ ది ఇయర్, వనే్డ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్) అందుకోవడం ద్వారా ఇంతవరకు ఎవరూ సాధించని చరిత్రను సృష్టించాడు. ఈ మూడు ప్రతిష్టాత్మక అవార్డులతో ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ సర్ గార్‌ఫీల్డ్ సోబెర్స్ ట్రోఫీని తొలిసారి అందుకుని కోహ్లీ చరిత్ర సృష్టించాడు. క్రికెటర్ ఆఫ్ ఇయర్ అవార్డు దక్కించుకోవడం టీమిండియా కెప్టెన్‌కు ఇది రెండోసారి (గత 2017లో కోహ్లీ సర్ గార్‌ఫీల్డ్ ట్రోఫీతోపాటు, ఐసీసీ వనే్డ ఇంటర్నేషనల్ ప్లేయర్ అవార్డు, 2012లో ఐసీసీ వనే్డ ఇంటర్నేషనల్ ప్లేయర్ ఆఫ్ ఇయర్ అవార్డు అందుకున్నాడు). అయితే, తొలిసారిగా మాత్రం 2018 సంవత్సరానికిగాను టెస్టు క్రికెటర్ ఆఫ్ ఇయర్ పురస్కారాన్ని అందుకున్నాడు. ‘2018లో టీమిండియా సారధిగా చూపిన అద్భుత ప్రదర్శనతోపాటు జట్టును విజయపథంలో నడిపినందుకుగాను కోహ్లీని ఐసీసీ టెస్టు, ఐసీసీ వనే్డ జట్లకు కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ పేరును ప్రతిపాదించాం’ అని ఐసీసీ తెలిపింది. గత ఏడాది కోహ్లీ ఆడిన 13 టెస్టు మ్యాచ్‌లలో 55.08 సగటున 1322 పరుగులు చేశాడు. ఇందులో 5 శతకాలు ఉన్నాయి. ఇటీవల ఆస్ట్రేలియాలో టీ-20, టెస్టు, వనే్డ సిరీస్‌లలో జట్టును కెప్టెన్‌గా అద్భుతంగా నడిపించాడు. 71 ఏళ్ల తర్వాత ఆసిస్ గడ్డపై ఇంతవరకు ఎవరికీ సాధ్యంకాని రీతిలో తొలిసారిగా మూడు ఫార్మాట్లలోనూ క్లీన్ స్వీప్ చేసిన ఘనతను కోహ్లీ సాధించాడు. 2018లో 14 వనే్డ ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ 133.55 సగటున 6 శతకాలతో కలిపి 1202 పరుగులు సాధించాడు. అదేవిధంగా గత సంవత్సరం 10 టీ-20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడిన కెప్టెన్ 211 పరుగులు చేశాడు. గత ఏడాది కోహ్లీ సారథ్యంలో టీమిండియా 7 టెస్టు మ్యాచ్‌లలో ఆడగా వీటిలో 6 టెస్టుల్లో గెలుపు, 1 టెస్టులో ఓటమిని ఎదుర్కొంది. అదేవిధంగా 14 వనే్డ ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడగా, వీటిలో 9 వనే్డల్లో విజయం, 4 వనే్డలో పరాజయాన్ని చవిచూడగా, ఒక వనే్డ టైగా ముగిసింది. ‘గత ఏడాది కాలంలో క్రికెట్‌లో వ్యక్తిగతంగా సాధించిన పరుగులతోపాటు అద్భుత ప్రదర్శన, పోరాట పటిమను దృష్టిలో ఉంచుకుని టీమిండియా కెప్టెన్‌ను ప్రతిష్టాత్మక అవార్డులకు ఎంపిక చేశాం’ అని ఐసీసీ ఒక ప్రకటనలో పేర్కొంది. కోహ్లీ కెప్టెన్‌గా వ్యవహరించనున్న ఐసీసీ టెస్టు టీమ్‌లో ముగ్గురు భారత క్రికెటర్లు, ముగ్గురు న్యూజిలాండ్ క్రికెటర్లు ఉంటారు. కోహ్లీ కెప్టెన్ వ్యవహరించనున్న వనే్డ ఇంటర్నేషనల్ మ్యాచ్ టీమ్‌లో భారత్, ఇంగ్లాండ్‌కు చెందిన నలుగురు వంతున క్రికెటర్లు సభ్యులుగా ఉంటారు. టెస్టు టీమ్‌లో వికెట్ కీపర్, యువ బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్, ఫాస్ట్‌బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఉన్నారు. వనే్డ టీమ్‌లో ఓపెనర్ రోహిత్ శర్మ, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా ఉన్నారు. టెస్టు, వనే్డ జట్టులో కోహ్లీతోపాటు చోటుదక్కించుకున్న భారత క్రికెటర్లలో జస్ప్రీత్ బుమ్రా ఒక్కడే ఉన్నాడు. ఇదిలావుండగా, సర్ గార్‌ఫీల్డ్ సోబెర్స్ ట్రోఫీకి చెందిన ఓటింగ్ అకాడమీ ఎంపిక చేసిన అవార్డు (2018 టెస్టు ప్లేయర్ ఆఫ్ ది ఇయర్)ను దక్షిణాఫ్రికా ఫాస్ట్‌బౌలర్ కగిసొ రబద కూడా అందుకున్నాడు. కోహ్లీ తర్వాత అఫ్గనిస్తాన్ లెగ్‌స్పిన్నర్ రషీద్ ఖాన్ 2018 సంవత్సరానికిగాను ఐసీసీ వనే్డ ఇంటర్నేషనల్ ప్లేయర్ ఆఫ్ ది అవార్డును దక్కించుకున్నాడు.
ఐసీసీ పురుషుల టెస్టు టీమ్ ఆఫ్ ది ఇయర్ (బ్యాటింగ్ ఆర్డర్): టామ్ లాథమ్ (న్యూజిలాండ్), దిముత్ కరుణరత్నే (శ్రీలంక), కేన్ విలియమ్‌సన్ (న్యూజిలాండ్), విరాట్ కోహ్లీ (కెప్టెన్-్భరత్), హెన్రీ నికోల్స్ (న్యూజిలాండ్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్-భారత్), జాసన్ హోల్డర్ (వెస్టిండీస్), కగిసొ రబద (దక్షిణాఫ్రికా), నాథన్ లియాన్ (ఆస్ట్రేలియా), జస్ప్రీత్ బుమ్రా (భారత్), మహమ్మద్ అబ్బాస్ (పాకిస్తాన్).
ఐసీసీ పురుషుల వనే్డ ఇంటర్నేషనల్ టీమ్ ఆఫ్ ది ఇయర్ (బ్యాటింగ్ ఆర్డర్): రోహిత్ శర్మ (్భరత్), జానీ బెయిర్‌స్టో (ఇంగ్లాండ్), విరాట్ కోహ్లీ (కెప్టెన్-రత్), జో రూట్ (ఇంగ్లాండ్), రాస్ టేలర్ (న్యూజిలాండ్), జొస్ బట్లర్ (వికెట్ కీపర్-ఇంగ్లాండ్), బెన్ స్టోక్స్ (ఇంగ్లాండ్), ముస్త్ఫాజుర్ రహ్మాన్ (బంగ్లాదేశ్), రషీద్ ఖాన్ (అఫ్గనిస్తాన్), కుల్దీప్ యాదవ్ (్భరత్), జస్ప్రీత్ బుమ్రా (భారత్).
ఐసీసీ ఎమర్జింగ్ క్రికెటర్‌గా రిషబ్ పంత్
టీమిండియాలో వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్‌గా అతి తక్కువ కాలంలోనే వినుతికెక్కిన యువ సంచలనం రిషబ్ పంత్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) 2018 సంవత్సరానికిగాను ‘ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ఇయర్’ అవార్డుకు ఎంపిక చేసింది. 21 ఏళ్ల పంత్ గత ఏడాది ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టులో తన అద్భుత ఆటతీరుతో సెంచరీతో ఆకట్టుకోవడంతోపాటు ఇటీవల టీమిండియా ఆస్ట్రేలియా టూర్‌లో భాగంగా అడెలైడ్‌లో జరిగిన టెస్టులో వికెట్ కీపర్‌గా 11 క్యాచ్‌లు పట్టుకున్నాడు.
అంతేకాకుండా ఆస్ట్రేలియాపై ఆడిన ఒక టెస్టు మ్యాచ్‌లో శతకం కొట్టిన తొలి భారత వికెట్ కీపర్‌గా ఘనత సాధించాడు. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని రిషబ్ పంత్‌ను ‘ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్’ పురస్కారానికి ఎంపిక చేసినట్టు ఐసీసీ ఒక ప్రకటనలో పేర్కొంది.