క్రీడాభూమి

సెరెనా, నిషికొరి ఆశలు ఆవిరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్‌బోర్న్, జనవరి 23: అమెరికా టెన్నిస్ స్టార్, నల్లకలువ, 24వసారి గ్రాండ్ శ్లామ్ టైటిల్ చేజిక్కించుకోవాలని ఉబలాటపడిన ప్రపంచ నెంబర్ 16 క్రీడాకారిణి సెరెనా విలియమ్స్‌కు ఆస్ట్రేలియా ఓపెన్ మహిళల సింగిల్స్‌లో నిరాశే ఎదురైంది. బుధవారం జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో తన సమీప ప్రత్యర్థి, వరల్డ్ నెంబర్ 7 ర్యాంకర్, చెక్ క్రీడాకారిణి కరొలినా ప్లిస్కోవా చేతిలో ఓటమిని ఎదుర్కొంది. ఈ పోటీలో 6-4, 4-6, 7-5 తేడాతో సెరెనాను ఓడించిన ప్లిస్కోవా సెమీఫైనల్స్‌లోకి దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లోని మొదటి సెట్‌లో ప్రత్యర్థికి గట్టి పోటీ ఇచ్చిన సెరెనా రెండో సెట్‌లో పైచేయి సాధించింది. అయితే, మూడో సెట్‌లో కరొలినా అద్భుతంగా ఆడడంతో ప్రత్యర్థికి గట్టి ప్రతిఘటన ఇచ్చినప్పటికీ సెరెనా ఆస్ట్రేలియా ఓపెన్ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. ఇక మహిళల సింగిల్స్‌లో జరిగిన మరో పోటీలో ప్రపంచ నెంబర్, జపాన్‌కు చెందిన నవొమి ఒకాసాకు ఎదురు లేకుండా పోయింది. సెమీస్‌లో బెర్త్ కోసం జరిగిన మ్యాచ్‌లో ఒసాకా తన సమీప ప్రత్యర్థి, ఉక్రెయిన్‌కు చెందిన వరల్డ్ నెంబర్ 6వ ర్యాంకర్ ఎలినా స్విటొలినాను 6-4, 6-1 తేడాతో ఓడించింది. పురుషుల సింగిల్స్ విభాగంలో క్వార్టర్ ఫైనల్స్‌లో జరిగిన పోటీలో ప్రపంచ నెంబర్ వన్, సెర్బియా స్టార్ దిగ్గజం నవోక్ జొకోవిచ్ ముందు జపాన్ స్టార్, ప్రపంచ నెంబర్ 8వ ర్యాంకర్ కీ నిషికొరి తలొగ్గాల్సి వచ్చింది. సెమీఫైనల్స్‌లో చోటు కోసం జరిగిన ప్రతిష్టాత్మక పోటీలో 6-4, 4-1 తేడాతో జొకోవిచ్ విజయం సాధించాడు. పురుషుల సింగిల్స్‌లో జరిగిన మరో మ్యాచ్‌లో వరల్డ్ నెంబర్ 28వ ర్యాంకర్, ఫ్రెంచ్‌కు చెందిన లుకాస్ పౌలీ తన సమీప ప్రత్యర్థి, కెనడాకు చెందిన ప్రపంచ 16వ ర్యాంకర్ మిలొస్ రావొనిక్‌ను 7-6 (7-4), 6-3, 6-7 (2-7), 6-4 తేడాతో ఓడించి సెమీఫైనల్స్‌లో బెర్త్ ఖాయం చేసుకున్నాడు.
ఆస్ట్రేలియా ఓపెన్

చిత్రాలు.. కరొలినా ప్లిస్కోవా* నవొక్ జొకోవిచ్