క్రీడాభూమి

మ్యాచ్ ఆడిన కొద్దిసేపటికే ఫుట్‌బాలర్ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియో డి జెనీరో, మే 9: ఒక అమెచ్యూర్ మ్యాచ్ ఆడిన కొద్ది సేపటికే బ్రెజిల్ ఫుట్‌బాలర్ బెర్నార్డో రిబెరో అనారోగ్యానికి గురై, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. బ్రెజిల్ దేశవాళీ పోటీల్లో ఫ్రిబర్గెన్స్ తరఫున రిక్రియో నగరంలో జరిగిన ఒక మ్యాచ్‌లో రిబెరో పాల్గొన్నాడు. ద్వితీయార్ధంలో అతను అస్వస్తతకు గురికావడంతో సబ్‌స్టిట్యూట్ ఆటగాడిని పంపి అతనికి ప్రాథమిక చికిత్స అందించినట్టు ఫ్రిబర్గెన్స్ యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది. మ్యాచ్ పూర్తయ్యే సమయానికి రిబెరో ఆరోగ్యం క్షీణించడం మొదలైందని, వెంటనే అతనిని ఆసుపత్రికి తరలించాలని ఆ ప్రకటనలో పేర్కొంది. చికిత్స పొందుతూ అతను మృతి చెందాడని తెలిపింది. అతని లేని లోటును ఎవరూ భర్తీ చేయలేరని ఆవేదన వ్యక్తం చేసింది.
బెల్జియం కెప్టెన్ కొంపనీకి గాయం
బ్రసెల్స్: బెల్జియం సాకర్ జట్టు కెప్టెన్ వినె్సంట్ కొంపనీకి కాలి కండరాలు బెణకడంతో ఆటకు దూరమయ్యాడు. అతనికి కొన్ని వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు స్పష్టం చేయడంతో అతను ఈ ఏడాది యూరో కప్ సాకర్ చాంపియన్‌షిప్ టోర్నీకి దూరమయ్యాడు. కొంపనీ ఈ విషయాన్ని సోషల్ నెట్‌వర్క్ ద్వారా తెలిపాడు.

చిత్రం బెర్నార్డో రిబెరో