క్రీడాభూమి

టీమిండియాదే తొలి వనే్డ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేపియర్: న్యూజిలాండ్ గడ్డపై టీమిండియా శుభారంభం చేసింది. ఆతిధ్య జట్టుతో జరుగనున్న 5 వనే్డ ఇంటర్నేషనల్ సిరీస్‌లో భాగంగా బుధవారం ఇక్కడి మెక్‌క్లీన్ పార్క్‌లో జరిగిన తొలి వనే్డలో కోహ్లీ సేన 8 వికెట్ల తేడాతో ఘన విజయంతో ప్రత్యర్థిపై 1-0తో ఆధిక్యంలో నిలిచింది. భారత బౌలర్లు మహమ్మద్ షమీ 19/3, కుల్దీప్ యాదవ్ 39/4తో అద్భుతంగా రాణించారు. తొలుత టాస్ గెలిచిన కివీస్ బ్యాటింగ్‌ను ఎంచుకుంది. ఎక్కడైనా వర్షం కారణంగా మ్యాచ్‌లు నిలిచిపోవడం జరుగుతుంది. కానీ న్యూజిలాండ్‌లో అందుకు భిన్నమైన పరిస్థితులు కనిపించాయి. భారత్ జట్టు బ్యాటింగ్ సమయంలో సూర్యుడు ఆటంకం కల్పించడంతో మ్యాచ్‌ను దాదాపు అరగంటపాటు నిలిపివేశారు. ప్రపంచంలోని చాలాదేశాల్లో పిచ్‌లు ఉత్తర, దక్షిణ అభిముఖంగా ఉంటాయి. కానీ కివీస్‌లోని మెక్‌క్లీన్ పార్క్ మైదానం పిచ్ మాత్రం అందుకు భిన్నంగా ఉంటుంది. ఇక్కడి పిచ్ తూర్పు, పడమర ముఖంగా ఉండడంతో సూర్యోదయం, సూర్యాస్తమయం సమయాల్లో బ్యాట్స్‌మెన్‌లు బంతులను ఎదుర్కోవడం కష్టమవుతుంది. సూర్యకిరణాలు నేరుగా బ్యాట్స్‌మెన్ కళ్లలోకి పడడంతో బుధవారం నాటి తొలి వనే్డలో డిన్నర్ తర్వాత కాసేపు మ్యాచ్‌ను నిలిపివేశారు. ఒక అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లో తొలిసారిగా సూర్యకిరణాల వల్ల మ్యాచ్‌కు కాసేపు అంతరాయం కలగడం ఇదే తొలిసారి. ఆ తర్వాత మ్యాచ్‌ను కొనసాగించగా ఆతిధ్య కివీస్ 38 ఓవర్లలో 157 పరుగులకు ఆలౌటైంది. సూర్యకిరణాల కారణంగా మ్యాచ్ నిరాఘాటంగా జరుగకుండా దాదాపు అంతరాయం కలిగించిన నేపథ్యంలో ఆటగాళ్లకు వడదెబ్బ తగిలే ప్రమాదాన్ని ఊహించిన ఆన్‌ఫీల్డ్ ఎంపైర్ షాన్ జార్జ్ వారితోపాటు ఎంపైర్ల ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని డక్ వర్త్ లూయిస్ పద్ధతి అనుసరించి ప్రత్యర్థి లక్ష్యాన్ని కుదించారు. ఆ తర్వాత బరిలోకి దిగిన భారత్ 34.5 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 156 పరుగులు చేసి తొలి వనే్డని తన ఖాతాలో జమ చేసుకుంది.
తొలుత బ్యాటింగ్‌కు దిగిన కివీస్ ఓపెనర్లను పెవిలియన్‌కు పంపడం ద్వారా మహమ్మద్ షమీ ప్రత్యర్థిని బలంగా దెబ్బతీశాడు. 9 బంతులు ఎదుర్కొన్న మార్టిన్ గుప్తిల్ 1 బౌండరీతో 5 పరుగులు చేసి మహమ్మద్ షమీ చేతిలో బౌల్డ్ అయ్యాడు. కొలిన్ మున్రో 9 బంతులు ఎదుర్కొని 2 బౌండరీలతో 8 పరుగులు చేసి మహమ్మద్ షమీ చేతిలోనే బౌల్డ్ అయ్యాడు. 41 బంతులు ఎదుర్కొన్న రాస్ టేలర్ 3 బౌండరీలతో 24 పరుగులు చేసి యుజ్వేంద్ర చాహల్ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. వికెట్ కీపర్ టామ్ లాథమ్ 10 బంతులు ఎదుర్కొని 1 బౌండరీతో 11 పరుగులు చేసి యుజేంద్ర చాహల్ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చాడు. 17 బంతులు ఎదుర్కొన్న హెన్రీ నికొలస్ 1 బౌండరీతో 12 పరుగులు చేసి కేదార్ జాదవ్ బౌలింగ్‌లో కుల్దీప్ యాదవ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారిపట్టాడు. మిచెల్ సంత్‌నెర్ 21 బంతులు ఎదుర్కొని 1 సిక్సర్, మరో బౌండరీతో 14 పరుగులు చేసి మహమ్మద్ షమీ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుతిరిగాడు. కెప్టెన్ కేన్ విలియమ్‌సన్ 81 బంతులు ఎదుర్కొని 7 బౌండరీలతో చెలరేగి 64 పరుగులు చేసి కుల్దీప్‌యాదవ్ బౌలింగ్‌లో విజయ్ శంకర్‌కు క్యాచ్ ఇచ్చా
పెవిలియన్ దారిపట్టాడు డౌగ్ బ్రేస్‌వెల్ 15 బంతులు ఎదుర్కొని 1 బౌండరీతో 7 పరుగులు చేసి కుల్దీప్ యాదవ్ చేతిలో బౌల్డ్ అయ్యాడు. 3 బంతులు ఎదుర్కొని పరుగులేమీ చేయని లాక్లీ ఫెర్గ్‌సన్‌ను కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో ధోనీ స్టంపవుట్ చేశాడు. ట్రెంట్ బౌల్ట్ 10 బంతులు ఎదుర్కొని 1 పరుగు చేసి కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చాడు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 10 ఓవర్లలో 39 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. మహమ్మద్ షమీ 6 ఓవర్లలో 19 పరుగులు, యుజ్వేంద్ర చాహల్ 10 ఓవర్లలో 43 పరుగులిచ్చి 2 వికెట్లు, కేదార్ జాదవ్ 3 ఓవర్లలో 17 పరుగులిచ్చి 1 వికెట్ తీసుకున్నారు. అనంతరం బ్యాటింగ్ భారత్ జట్టులో ఓపెనర్ రోహిత్ శర్మ నిరాశపరిచినా మరో ఓపెనర్, స్టయిలిష్ బ్యాట్స్‌మన్ శిఖర్ ధావన్ మ్యాచ్‌ను గెలిపించే బాధ్యతను నిర్వర్తించాడు. 24 బంతులు ఎదుర్కొన్న రోహిత్ శర్మ 1 బౌండరీతో 11 పరుగులు చేసి బ్రేస్‌వెల్ బౌలింగ్‌లో మార్టిన్ గుప్తిల్‌కు క్యాచ్ ఇచ్చాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ 59 బంతులు ఎదుర్కొని 3 బౌండరీలతో 45 పరుగులు చేసి లాక్లే ఫెర్గ్‌సన్ బౌలింగ్‌లో లియాన్ నాథన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారిపట్టాడు. 103 పరుగులు ఎదుర్కొన్న శిఖర్ ధావన్ 6 బౌండరీలతో 75, అంబటి రాయుడు 23 బంతులు ఎదుర్కొని 2 బౌండరీలతో 13 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. న్యూజిలాండ్ బౌలర్లలో లాక్లే ఫెర్గ్‌సన్ 8 ఓవర్లలో 42, డౌగ్ బ్రేస్‌వెల్ 7 ఓవర్లలో 23 పరుగులిచ్చి తలో వికెట్ తీసుకున్నారు.

చిత్రం..అర్ధసెంచరీ సాధించిన ధావన్‌ను అభినందిస్తున్న కోహ్లీ