క్రీడాభూమి

ఒలింపిక్స్‌కు అర్హతతో మా బాధ్యత పెరిగింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 9: రియో ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించడంతో తమపై బాధ్యత మరింత పెరిగిందని భారత బాడ్మింటన్ పురుషుల డబుల్స్ స్పెషలిస్ట్‌లు సుమీత్ రెడ్డి, మను అత్రి అన్నారు. భారత్ నుంచి ఒలింపిక్స్‌కు అర్హత పొందిన తొలి బాడ్మింటన్ జోడీగా చరిత్ర సృష్టించిన వీరు సోమవారం పిటిఐతో మాట్లాడుతూ ప్రాక్టీస్, ఫిట్నెస్ అనే రెండు అంశాలపై దృష్టి కేంద్రీకరిస్తున్నామని అన్నారు. నాలుగేళ్లకోసారి వచ్చే ఒలింపిక్స్‌లో ప్రపంచ దేశాలకు చెందిన హేమాహేమీ జట్లు బరిలోకి దిగుతాయని, పోటీ తీవ్రంగా ఉంటుందని సుమీత్ అన్నాడు. అయితే, తమకంటే మెరుగైన ర్యాంక్‌లో ఉన్న వారే ఎక్కువగా ఒత్తిడికి గురవుతారని అభిప్రాయపడ్డాడు. దీనిని అవకాశంగా తీసుకొని విజయాలను సాధిస్తామని ధీమా వ్యక్తం చేశాడు. మను మాట్లాడుతూ అనుభవం కూడా అంతర్జాతీయ స్థాయి పోటీల్లో కీలక పాత్ర పోషిస్తుందని అన్నాడు. అదే విధంగా ఫిట్నెస్ స్థాయి కూడా గొప్పగా ఉండాలని చెప్పాడు. ఒలింపిక్స్ ఆరంభమయ్యేలోగా దొరికిన ప్రతి క్షణాన్ని ప్రాక్టీస్ కోసం వెచ్చిస్తామని, ఫిట్నెస్‌ను కాపాడుకుంటామని అన్నాడు.

chitram భారత బాడ్మింటన్ జోడీ సుమీత్, మను