క్రీడాభూమి

ఉత్కంఠ పోరులో బెంగళూరు విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొహాలీ, మే 9: పాయింట్ల పట్టికలో చివరి నుంచి మొదటి రెండు స్థానాల్లో ఉన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్ల మధ్య సోమవారం జరిగిన మ్యాచ్ చివరి క్షణం వరకూ ఉత్కంఠను రేపింది. హోరాహోరీగా సాగిన పోరులో బెంగళూరు ఒక పరుగు తేడాతో పంజాబ్‌ను ఓడించి ఊపిరి పీల్చుకుంది. 176 పరుగుల లక్ష్యాన్ని సాధించేందుకు మురళీ విజయ్ (89) చివరిలో మార్కస్ స్టొయినిస్ (34 నాటౌట్) చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అంతకు ముందు డివిలియర్స్ అర్ధ శతకంతో ఆదుకోవడంతో బెంగళూరు 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 175 పరుగులు చేయగలిగింది. లోకేష్ రాహుల్ కూడా అతనికి సహకరించాడు.
డిలిమియర్స్ అర్ధ శతకం
ప్రత్యర్థి ఆహ్వానం మేరకు ఇన్నింగ్స్ ఆరంభించిన బెంగళూరుకు కెప్టెన్ విరాట్ కోహ్లీ, వికెట్‌కీపర్ లోకేష్ రాహుల్ శుభారంభ్నాచ్చారు. 13 మ్యాచ్‌ల్లో మొదటి వికెట్‌కు 50 లేదా అంతకు మించి పరుగులు జత చేయలేకపోయిన కోహ్లీ, రాహుల్ వరుసగా రెండోసారి అర్ధ శతకానికి పైగా పార్ట్‌నర్‌షిప్‌ను అందించారు. 63 పరుగుల స్కోరువద్ద కరియప్ప బౌలింగ్‌లో అవుటైన రాహుల్ 25 బంతులు ఎదుర్కొని, ఆరు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 42 పరుగులు చేశాడు. మరో పరుగు తర్వాత కోహ్లీ కూడా వెనుదిరిగాడు. అతను 21 బంతులు ఎదుర్కొని, రెండు ఫోర్లతో 20 పరుగులు చేశాడు. షేన్ వాట్సన్ ఒక పరుగు చేసి అక్షర్ పటేల్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. 67 పరుగులకు మూడు వికెట్లు కూలిన దశలో ఎబి డివిలియర్స్, సచిన్ బేబీ బెంగళూరును ఆదుకున్నారు. పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడిన డివిలియర్స్ 35 బంతుల్లో 64 పరుగులు చేసి, సందీప్ శర్మ బౌలింగ్‌లో కరియప్ప క్యాచ్ అందుకోగా పెవిలియన్ చేరాడు. అతని స్కోరులో ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. నాలుగో వికెట్‌కు 88 పరుగులు జత కలవడంతో బెంగళూరు కోలుకుంది. ఓవర్లు ముగింపు దశకు చేరుతున్న తరుణంలో వేగంగా పరుగులు సాధించే క్రమంలో సందీప్ శర్మ బౌలింగ్‌లో మురళీ విజయ్‌కి ట్రావిస్ హెడ్ (11) దొరికిపోయాడు. తర్వాతి బంతికి సచిన్ బేబీ రనౌటయ్యాడు. అతను 29 బంతులు ఎదుర్కొని, ఒక ఫోర్ సాయంతో 33 పరుగులు సాధించి, ఇన్నింగ్స్ చివరి బంతికి వెనుదిరిగాడు. బెంగళూరు 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 175 పరుగులు సాధించగా, ఒక్క బంతిని కూడా ఎదుర్కొనే అవకాశం రాని స్టువర్ట్ బిన్నీ నాటౌట్‌గా నిలిచాడు. పంజాబ్ బౌలర్లు సందీప్ శర్మ 49 పరుగులకు రెండు, కరియప్ప 16 పరుగులకు రెండు చొప్పున వికెట్లు సాధించారు.
చివరి క్షణం వరకూ పోటాపోటీ
బెంగళూరును ఓడించి పరువు నిలబెట్టుకోవడానికి 176 పరుగులు చేయాల్సి ఉండగా, మురళీ విజయ్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ఆరంభించిన హషీం ఆమ్లా 21 పరుగులు చేసి స్టువర్ట్ బిన్నీ క్యాచ్ అందుకోగా షేన్ వాట్సన్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. 45 పరుగుల స్కోరువద్ద పంజాబ్ తొలి వికెట్ చేజార్చుకుంది. అనంతరం వృద్ధిమాన్ సాహాతో కలిసి విజయ్ పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రయత్నించాడు. రెండో వికెట్‌కు 5.3 ఓవర్లలో 43 పరుగులు జత కలిసిన తర్వాత యజువేంద్ర చాహల్ బౌలింగ్‌లో లోకేష్ రాహుల్ స్టంప్ చేయడంతో సాహా (16) అవుటయ్యాడు. తర్వాతి బంతికి డేవిడ్ మిల్లర్ (0) కూడా అదే తరహాలో వెనుదిరిగాడు. మార్కస్ స్టొయినిస్‌తో కలిసి నాలుగో వికెట్‌కు ఆరు ఓవర్లలో 51 పరుగుల భాగస్వామ్యాన్ని అందించిన విజయ్ 89 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద షేన్ వాట్సన్ బౌలింగ్‌లో చాహల్ క్యాచ్ పట్టగా అవుటయ్యాడు. 57 బంతులు ఎదుర్కొన్న అతని స్కోరులో 12 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. స్టొయినిస్, ఫర్హాన్ బెహర్డియన్ కలిసి స్కోరును ముందుకు నడిపించారు. చివరికి ఓవర్‌లో పంజాబ్‌కు 17 పరుగులు అవసరంకాగా, క్రిస్ జోర్డాన్ బౌలింగ్‌కు దిగాడు. మొదటి బంతికి బెహర్డియన్ సింగిల్ తీసి, స్టొయినిస్‌కు అవకాశం ఇచ్చాడు. రెండో బంతిని ఫోర్ కొట్టిన స్టొయినిస్ ఆతర్వాతి బంతిని సిక్స్‌గా మార్చాడు. దీనితో విజయంపై పంజాబ్ ఆశలు పెరిగాయి. అయితే, నాలుగో బంతిలో ఒక్క పరుగు కూడా లభించలేదు. ఐదో బంతిలో రెండు పరుగులు లభించాయి. చివరి బంతికి నాలుగు పరుగులు చేయాల్సి ఉండగా, స్టొయినిస్ రెండు పరుగులతో సరిపుచ్చుకున్నాడు. పంజాబ్ 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 174 పరుగులు చేసి, ఒక పరుగు తేడాతో ఓటమిపాలైంది. బెంగళూరు నాకౌట్ ఆశలు సజీవంగా నిలిచాయ.
సంక్షిప్త స్కోర్లు
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: 20 ఓవర్లలో 6 వికెట్లకు 175 (విరాట్ కోహ్లీ 20, లోకేష్ రాహుల్ 42, ఎబి డివిలియర్స్ 64, సచిన్ బేబీ 33, కరియప్ప 2/16, సందీప్ శర్మ 2/49).
కింగ్స్ ఎలెవెన్ పంజాబ్: 20 ఓవర్లలో 4 వికెట్లకు 174 (మురళీ విజయ్ 89, మార్కస్ స్టొయినిస్ 34, హషీం ఆమ్లా 21).