క్రీడాభూమి

యుఫా అధ్యక్ష పదవికి ప్లాటినీ రాజీనామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పారిస్, మే 9: అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (్ఫఫా) నుంచి ఇది వరకే సస్పెన్షన్‌కు గురైన మైఖేల్ ప్లాటినీ ఇప్పుడు యూనియన్ ఆఫ్ యూరోపియన్ ఫుట్‌బాల్ అసోసియేషన్ (యుఫా)కు కూడా దూరమయ్యాడు. తనను ఫిఫా నుంచి సస్పెండ్ చేయడాన్ని సవాలు చేస్తూ అంతర్జాతీయ క్రీడా మధ్యవర్తిత్వ కోర్టు (సిఎఎస్)లో పిటిషన్ దాఖలు చేసిన ప్లాటినీకి అక్కడ కూడా చుక్కెదురైంది. అతని అప్పీల్‌ను సిఎఎస్ తోసిపుచ్చడంతో అతను యుఫా అధ్యక్ష పదవికి రాజీనామా చేశాడు. 2007 నుంచి యుఫా అధ్యక్షుడిగా కొనసాగుతున్న ఈ ఫ్రెంచ్ మాజీ ఫుట్‌బాలర్‌కు అంతర్జాతీయ సాకర్‌పై గట్టిపట్టు ఉంది. అయితే, బాట్లర్‌ను బ్లాక్‌మెయిల్ చేసి, అతనికి సహకరించేందుకు ఒప్పందం కుదుర్చుకొని భారీ మొత్తాన్ని తన ఖాతాలో జమ చేసుకున్నాడన్న ఆరోపణలు అతని ప్రతిష్టను దిగజార్చాయి. తాను ఎలాంటి పొరపాటు చేయలేదని, న్యాయంగానే తనకు రావాల్సిన మొత్తాన్ని తీసుకున్నానని ప్లాటినీ చేసిన వాదనతో సిఎస్‌ఎ ఏకీభవించలేదు. ఈ కేసులో ఫిఫా విధించిన సస్పెన్షన్ వేటును రద్దు చేయలేమని స్పష్టం చేస్తూ ప్లాటినీ పిటిషన్‌ను కొట్టేసింది.
ఫిఫా అధ్యక్ష పదవికి 2011లో, నాలుగోసారి పోటీ చేసినప్పుడు ప్లాటినీ మద్దతును కోరిన బ్లాటర్ అతనికి భారీ మొత్తాన్ని ఫిఫా ఖజానా నుంచి చెల్లించాడన్న ఆరోపణలు వెల్లువెత్తాయ. అంతకు ముందు సుమారు దశాబ్దం క్రితం ఒక ఒప్పందాన్ని అనుసరించి ప్లాటినీ ఫిఫాకు పనులు చేశాడని పేర్కొంటూ, రెండు మిలియన్ డాలర్లను (సుమారు 13 కోట్ల రూపాయలు) బ్లాటర్ చెల్లించడం అనుమానాలకు తావిచ్చింది. ప్లాటినీని మంచి చేసుకోని, అధ్యక్షుడిగా ఎన్నికయ్యేందుకే ఈ మొత్తాన్ని ఇచ్చాడని వచ్చిన ఆరోపణలపై జ్యూరిచ్ అటార్నీ జనరల్ కార్యాలయం విచారణ జరిపింది. తాను మళ్లీ ఫిఫా అధ్యక్ష పదవికి పోటీ చేయబోనని, చివరిసారి తనకు అవకాశం ఇవ్వాలని అప్పట్లో బ్లాటర్ బహిరంగంగానే కోరాడు. తన తర్వాత ఈ స్థానం ప్లాటినీదేనని ప్రకటించాడు. ఆ క్రమంలో భాగంగానే భారీ మొత్తాన్ని ప్లాటినీకి చెల్లించాడని వచ్చిన ఆరోపణలు నిజమేనని జ్యూరిచ్ అటార్నీ జనరల్ కార్యాలయం తేల్చిచెప్పింది. అనంతరం ఎథిక్స్ కమిటీ కూడా దాదాపు ఇదే అభిప్రాయానికి వచ్చింది. ఫలితంగా బ్లాటర్, ప్లాటినీలపై సస్పెన్షన్ వేటు పడింది. దీని ఫలితంగానే ఈ ఏడాది ఫిబ్రవరిలో అధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగిన ఎన్నికలకు ఫ్లాటినీ, మరో పోటీదారు చుంగ్ మాంగ్ జూన్ దూరమయ్యారు. కాగా, ఈ కేసు తలకుచుట్టుకోవడంతో సాకర్ ప్రపంచంలో తనకు ఉన్న పేరుప్రఖ్యాతులను పోగొట్టుకున్న ప్లాటినీ చివరి ప్రయత్నంగా సిఎఎస్‌ను ఆశ్రయించాడు. అక్కడ కూడా చుక్కెదురుకావడంతో, గత్యంతరం లేని పరిస్థితుల్లో యుఫా అధ్యక్ష పదవి నుంచి వైదొలిగాడు.