క్రీడాభూమి

రో‘హిట్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆక్లాండ్, ఫిబ్రవరి 8: తొలి టీ20 మ్యాచ్‌లో ఐదు బంతులాడి కేవలం ఒక పరుగు మాత్రమే చేసిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ శుక్రవారం ఆక్లాండ్ వేదికగా జరిగిన రెండో మ్యాచ్‌లో చెలరేగాడు. 172.41 స్ట్రైక్ రేట్‌తో 29 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించాడు. ఇందులో మూడు బౌండరీలు, నాలుగు సిక్సర్లు ఉండడం విశేషం. దీంతో భారత జట్టు మరో ఏడు బంతులు మిగిలి ఉండగానే, ఏడు వికెట్ల తేడాతో న్యూజిలాండ్ జట్టుపై విజయం సాధించింది.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్ మొదటి వనే్డ తరహాలోనే పర్యాటక జట్టుపై భారీ స్కోరు చేయాలనే లక్ష్యంతో బరిలోకి దిగింది. అయతే గత మ్యాచ్‌లో అర్ధ సెంచరీ సాధించి జట్టుకు విజయాన్ని అందించిన టిమ్ సీఫెర్ట్ (12)ను భువనేశ్వర్ కుమార్ తొందరగానే పెవిలియన్‌కు పంపగా, ఆ తర్వాత కొలిన్ మున్రో (12), కెప్టెన్ కేన్ విలియమ్సన్ (20), డరియల్ మిచెల్ (1) ని తొమ్మిది పరుగుల వ్యవధిలోనే కృనాల్ పాండ్య అవుట్ చేయడంతో 50 పరుగులకే ఆతిథ్య జట్టు నాలుగు కీలక వికెట్లు కోల్పోయ కష్టాల్లో పడింది. ఈ క్రమంలో సీనియర్ బ్యాట్స్‌మన్ రాస్ టేలర్, కొలిన్ డీ గ్రాండ్ హోంతో కలిసి జట్టు స్కోరును పరుగులు పెట్టించాడు. వీరిద్దరూ కలిసి ఐదో వికెట్‌కు 77 పరుగులను జోడించారు. ఈ క్రమంలో డీగ్రాండ్‌హోం (50) 28 బంతుల్లోనే అర్ధ సెంచరీ చేసి, హార్దిక్ పాండ్య బౌలింగ్‌లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మిచెల్ సాంత్నార్ తో కలిసి రాస్ టేలర్ (42) పరుగులు రాబట్టే క్రమంలో విజయ్ శంకర్ అద్భుత ఫీల్డింగ్‌తో రన్ అవుటయ్యాడు. ఈ క్రమంలో బౌలింగ్‌కు దిగిన ఖలీల్ అహమ్మద్ సాంత్నార్ (7), టిమ్ సౌథీ (3)ని అవుట్ చేయడంతో న్యూజిలాండ్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టపోయ 158 పరుగులు చేసింది. భారత బౌలర్లలో కృనాల్ పాండ్య 3, ఖలీల్ అహమ్మద్ 2, భువనేశ్వర్ కుమార్, హార్దిక్ పాండ్య చెరో వికెట్ తీసుకున్నారు.
హిట్ మ్యాన్ మెరుపులు..
159 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన భారత్ మొదటి ఓవర్ నుంచే కివీస్ బౌలర్లపై దాడికి దిగింది. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ బౌండరీలు సిక్సర్లతో అలరించాడు. గత మ్యాచ్‌లో కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసిన రోహిత్ (50), ఈ మ్యాచ్‌లో 172.41 స్ట్రైక్ రేట్‌తో 29 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించాడు. భారీ షాట్ ఆడే క్రమంలో ఇష్ సోదీ బౌలింగ్‌లో సౌథీకి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. మరో ఓపెవనర్ శిఖర్ ధావన్, యువ క్రికెటర్ రిషభ్ పంత్‌తో కలిసి జట్టు స్కోరును పెంచే బాధ్యతను తీసుకున్నాడు. ఈ క్రమంలో ధావన్ (30) లాకీ ఫెర్గూసన్ బౌలింగ్‌లో డీగ్రాండ్‌హోం పట్టిన క్యాచ్‌తో పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన విజయ్ శంకర్ (14)ను కొద్దిసేపటికే డరియల్ మిచెల్ అవుట్ చేశాడు. దీంతో రిషబ్ పంత్ (40) సినీయర్ క్రికెటర్ ఎంఎస్ ధోనీ (20)తో కలిసి మరో వికెట్ పడకుండా జట్టును విజయ తీరాలకు చేర్చాడు. మూడు వికెట్లతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన కృనాల్ పాండ్యకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

రోహిత్ ఖాతాలో రికార్డులు..

ఈ మ్యాచ్‌తో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఖాతాలో మరో రెండు రికార్డులు చేరాయ. టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు 92 టీ20లు ఆడిన రోహిత్ శర్మ 32.68 సగటుతో 2,288 పరుగులు చేసి మొదటి స్థానంలో నిలిచాడు. న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్తిల్ (2,272), షోయాబ్ మాలిక్ (2,263), విరాట్ కోహ్లీ (2,167), బ్రెండన్ మెక్‌కల్లామ్ (2,140) వరుసగా ఆ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.

20 సార్లు 50కి పైగా పరుగులు..

టీ20ల్లలో 20 సార్లు 50కి పైగా పరుగులు చేసిన జాబితాలో రోహిత్ శర్మ మొదటి స్థానంలో నిలిచాడు. ఆ తర్వాతి స్థానంలో రన్ మిషన్ విరాట్ కోహ్లీ ఉన్నాడు. కోహ్లీ ఈ ఫార్మట్‌లో 19 సార్లు 50పైగా పరుగులు చేశాడు.

స్కోరు బోర్డు..

న్యూజిలాండ్ ఇన్నింగ్స్:

టిమ్ సీఫెర్ట్ (సీ) ధోనీ (బీ) భువనేశ్వర్ 12,
కొలిన్ మున్రో (సీ) రోహిత్ (బీ) కృనాల్ పాండ్య 12,
కేన్ విలియమ్సన్ ఎల్‌బీ (బీ) కృనాల్ పాండ్య 20,
డరియల్ మిచెల్ ఎల్‌బీ (బీ) కృనాల్ పాండ్య 1,
రాస్ టేలర్ రనౌట్ (విజయ్ శంకర్) 42,
కొలిన్ డీ గ్రాండ్‌హోం 50,
మిచెల్ సాంత్నార్ (బీ) ఖలీల్ అహమ్మద్ 7,
స్కాట్ కుగ్లిల్జన్ (నాటౌట్) 2,
టిమ్ సౌథీ (బీ) ఖలీల్ అహమ్మద్ 3.

ఎక్స్‌ట్రాలు: 9, మొత్తం: 158 (20 ఓవర్లలో 8 వికెట్లకు)

వికెట్ల పతనం: 1-15, 2-41, 3-43, 4-50, 5-127, 6-153, 7-154, 8-158.

బౌలింగ్: భువనేశ్వర్ కుమార్ 4-0-29-1,
ఖలీల్ అహమ్మద్ 4-0-27-2,
హార్దిక్ పాండ్య 4-0-36-1,
కృనాల్ పాండ్య 4-0-28-3,
యుజువేంద్ర చాహల్ 4-0-37-0.

భారత్ ఇన్నింగ్స్:

రోహిత్ శర్మ (సీ) సౌథీ (బీ) ఇష్ సోదీ 50,
శిఖర్ ధావన్ (సీ) డీ గ్రాండ్‌హోం (బీ) లాకీ ఫెర్గూసన్ 30,
రిషభ్ పంత్ (నాటౌట్) 40,
విజయ్ శంకర్ (సీ) సౌథీ (బీ) డరియల్ మిచెల్ 14,
ఎంఎస్ ధోనీ (నాటౌట్) 20.

ఎక్స్‌ట్రాలు: 8

మొత్తం: 162 (18.5 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి)

వికెట్ల పతనం: 1-79, 2-88, 3-118.

బౌలింగ్: టిమ్ సౌథీ 4-0-340,
స్కాట్ కుగ్లిల్జన్ 3.5-0-32-0,
లాకీ ఫెర్గూసన్ 4-0-31-1,
మిచెల్ సాంత్నార్ 2-0-16-0,
ఇష్ సోదీ 4-0-31-1,
డరియల్ మిచెల్ 1-0-15-1.