క్రీడాభూమి

సాధిస్తారా..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హామిల్టన్: న్యూజిలాండ్ లో భారత్ పర్యటన నేటి మ్యాచ్‌తో ముగియనుంది. గత నెల 23న మొదటి వనే్డతో ప్రారంభమైన టోర్నీలో వనే్డ సిరీస్‌ను పర్యాటక జట్టు భారత్ 4-1తో కైవసం చేసుకుంది. దీంతో మొదటిసారి కివీస్ గడ్డపై 4-1తేడాతో భారత్ దాదాపు ఐదు దశాబ్దాల కలను నెరవేర్చుకుంది. ఆ తర్వాత ప్రారంభమైన టీ20 సిరీస్‌లో మొదటి మ్యాచ్ ఆతిథ్య జట్టు 80 పరుగుల తేడాతో గెలుచుకోగా, తప్పని సరి గెలవాల్సిన రెండో మ్యాచ్‌లో టీమిం డియా ఏడు వికెట్ల తేడాతో గెలుచుకుం ది. దీంతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఇరు జట్లు 1-1తో గెలుచుకోగా, చివరిదైనా మూడో మ్యాచ్‌లో విజయం ఎవరిని వరించనుందో నేడు మ్యాచ్‌తో తెలనుంది.
వరుస సిరీస్ విజయాలు..
న్యూజిలాండ్‌తో సిరీస్‌కు ముందు భారత్ 10 టీ20 సిరీస్‌లను వరుసగా గెలుచుకుంది. నేడు జరగబోయే టీ20 సిరీస్‌ను గెలిస్తే 11 సిరీస్‌లను గెలిచిన జట్టుగా దాయాది పాకి స్థాన్ జట్టుతో సమ ఉజ్జీలుగా నిలవనుంది. ప్రస్తుతం పాకిస్థాన్ 135 రేటింగ్ పాయంట్లతో ముందు వరుసలో ఉండగా, భారత్ 125 పాయంట్లతో రెండో స్థానంలో ఉంది. న్యూజిలాండ్ 115 పాయంట్లతో 6వ స్థానంలో కొనసాగుతోంది. చివరిదైన ఈ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే న్యూజిలాం డ్ గడ్డపై మొదటి సారి టీ20 సిరీస్ అం దించిన టీమిండియా నాయకుడిగా రో హిత్ శర్మ ఘనతను అందుకోనున్నాడు.
కివీస్‌కు కలిసొచ్చేనా?
న్యూజిలాండ్ ఎప్పుడెలా ఆడుతుం దో ఆ జట్టుకే తెలియదు. భారత్‌తో మిన హాయస్తే 2018 నుంచి ఇప్పటివరకు కివీస్ మొత్తం రెండు టీ20 సిరీస్‌లు ఆడింది. ఇందులో గతేడాది పాకిస్థాన్‌తో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో 3-0 తేడాతో ఓడింది. అయతే ఈ ఏడాది మొదటి నెల లో శ్రీలంకతో జరిగిన ఏకైక మ్యాచ్‌లో విజయం మాత్రం కివీస్‌నే వరించింది. పాక్ జట్టులో సగానికి పైగా కొత్త ఆటగాళ్లు ఉన్నా గెలవలేని న్యూజిలాండ్, శ్రీలంకతో మాత్రం 35 పరుగులతో నెగ్గింది. దీంతో బలమైన భారత జట్టును నిలువరించి సిరీస్ సాధించడమనేది కివీస్‌కు సాధ్యమైన పనేనా అనే సందేహం ఆ జట్టు ఆటగాళ్లతో పాటు సగటు క్రికెట్ అభిమానుల్లోనూ ఇదే సందేహం తలెత్తుతుందనేది వాస్తవం.
గప్తిల్ కొలుకున్నా..
మరోవైపు టీ20 సిరీస్‌కు ముందు నెట్ ప్రాక్టీస్‌లో గాయపడి వెనె్నముక నొప్పితో బాధపడుతున్న న్యూజిలాండ్ ఓపెనర్ మొదటి రెండు మ్యాచ్‌లకు దూరంగా ఉన్నాడు. అయతే చివరి మ్యాచ్‌కు ముందుగానే కొలుకున్న గప్తిల్‌ను మాత్రం ఆడించడ ం లేదని ఆ జట్టు క్రికెట్ బోర్డు ట్విట్టర్ ద్వారా తెలిపింది. అయతే గప్తిల్ ఆడిస్తే న్యూజిలాండ్ బ్యాటింగ్‌కు మరింత బలం చేకూరేది. కానీ ఈ 13 నుంచి బంగ్లాదేశ్‌తో జరిగే టోర్నీకి అందుబాటులో ఉంటాడని కివీస్ మేనేజ్‌మెంట్ ప్రకటించింది.
రోహిత్‌ను వరించనున్న రికార్డులు..
చివరి టీ20లో భారత్ గెలిస్తే న్యూజిలాండ్ గడ్డపై సిరీస్‌ను గెలుచుకున్న మొదటి భారత కె ప్టెన్‌గా రోహిత్ శర్మ ఘనతను సాధించనున్నాడు. అలాగే ఈ మ్యాచ్‌లో మరో రెండు సిక్స్‌లు బాదితే 104 సిక్సర్లతో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా రికార్డు సృష్టించనున్నాడు. దీంతో పాటు ఇప్పటివరకు 15 మ్యాచ్‌ల్లో సారథిగా వ్యవహరించి 13 మ్యాచ్‌ల్లో జట్టును గెలిపించిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పనున్నాడు.

జట్ల అంచనా..

భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, రిషభ్ పంత్, దినేష్ కార్తీక్, కేదార్ జాదవ్, ఎంఎస్ ధోనీ, కృనాల్ పాండ్య, కుల్దీప్ యాదవ్, యుజువేంద్ర చాహల్, భువనేశ్వర్ కుమార్, సిద్దార్థ్ కౌల్, ఖలీల్ అహమ్మద్, శుభ్‌మాన్ గిల్, విజయ్ శంకర్, హార్దిక్ పాండ్య, మహమ్మద్ సిరాజ్.
న్యూజిలాండ్: కేన్ విలియమ్సన్ (కెప్టెన్), డాగ్ బ్రాస్‌వెల్, కొలిన్ డీగ్రాండ్ హోం, లాకీ ఫెర్గూసన్, స్కాట్ కుగ్లీజైన్, కొలిన్ మున్రో, డరియల్ మిచెల్, మిచెల్ సాంత్నార్, టిమ్ సీఫార్ట్, ఇష్ సోధీ, టిమ్ సౌథీ, రాస్ టేలర్, బ్లేయర్ టిక్‌నర్, జేమ్ నీషమ్.