క్రీడాభూమి

పాక్‌లో మేం ఆడం : ఆస్ట్రేలియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరాచీ, ఫిబ్రవరి 10: ఆస్ట్రేలియా ను పాక్‌లో ఆడించాలనుకున్న పీసీబీ కి నిరాశ ఎదురైంది. ఇరు దేశాల మ ధ్య ద్వైపాక్షిక వనే్డ సిరీస్‌లో భాగంగా తమ దేశంలో రెండు మ్యాచ్‌లు ఆడాలంటూ పీసీబీ చేసిన విజ్ఞప్తిని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) తిరస్కరిం చింది. పాకిస్తాన్‌లో తమ ఆటగాళ్లకు భద్రతాపరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందనే ప్రభుత్వ సూచ నతో వెనక్కి తగ్గినట్లు సీఏ వెల్లడిం చింది. అయతే దీనిపై పాక్ క్రికెట్ బోర్డు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇది తమను తీవ్ర నిరాశకు గురిచేసినట్లు పీసీబీ డైరెక్టర్ జకీర్ ఖాన్ తెలిపారు. కాగా ఇరు జట్ల మధ్య యూఏఈ వేది కగా ఐదు వనే్డల సిరీస్ ప్రారంభం కానుంది. షార్జాలో తొలి రెండు వనే్డ లు, మూడో వనే్డ అబుదాబి వేదికగా జరగనుంది. మార్చి 22 నుంచి 31 మధ్యన ఈ సిరీస్ ఉండనుంది.