క్రీడాభూమి

క్రమశిక్షణపై రాజీ లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరాచీ, మే 10: ఆటగాళ్ల క్రమశిక్షణ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు కోచ్‌గా నియమితుడైన మికీ ఆర్థర్ స్పష్టం చేశాడు. మాజీ కెప్టెన్ వకార్ యూనిస్ రాజీనామా చేసిన తర్వాత అతని స్థానంలో కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్న ఆర్థర్ ఒక చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ క్రమశిక్షణకు సంబంధించిన సమస్యలేవీ ఉండవని నమ్ముతున్నానని చెప్పాడు. అయితే, ఎవరైనా క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడితే ఉపేక్షించబోనని స్పష్టం చేశాడు. ఆసియా చాంపియన్‌షిప్, టి-20 ప్రపంచ కప్ పోటీల్లో పాకిస్తాన్ వైఫల్యాలకు ఆటగాళ్లలో అంకిత భావం లోపించడమే ప్రధాన కారణమని అప్పటి కోచ్ వకార్ తన నివేదికలో ఆరోపించిన విషయం తెలిసిందే. ఆటగాళ్లలో, ప్రధానంగా సీనియర్లలో క్రమశిక్షణ కొరవడినందుకే వైఫల్యాలు తప్పలేదని పేర్కొన్నాడు. ఆ నివేదికను ఆర్థర్ పరోక్షంగా ప్రస్తావిస్తూ, క్రమశిక్షణ విషయంలో కఠినంగా వ్యవహరిస్తానని తెలిపాడు.
పరిస్థితులకు తగ్గ నిర్ణయాలు తీసుకోవాలి: అఫ్రిదీ
కరాచీ: ప్రస్తుత పరిస్థితులను అధ్యయనం చేసి, తగిన నిర్ణయాలు తీసుకొని అట్టడుగు స్థాయి నుంచి దేశంలో క్రికెట్‌ను పునర్నిర్మించాల్సిన అవసరం ఉందని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) అధికారులకు జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన ఆల్‌రౌండర్ షహీద్ అఫ్రిదీ హితవు పలికాడు. ఆసియా కప్, టి-20 వరల్డ్ కప్ చాంపియన్‌షిప్ టోర్నీల్లో పాకిస్తాన్ పరాజయాలను చవిచూసిన కారణంగా కెప్టెన్ అఫ్రిదీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వచ్చిన విషయం తెలిసిందే. సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడంతో, గత్యంతరం లేని పరిస్థితుల్లో నాయకత్వ బాధ్యతల నుంచి అతను వైదొలిగాడు. అయితే, టి-20 ఫార్మెట్‌లో కెరీర్‌ను కొనసాగిస్తానని స్పష్టం చేశాడు. అఫ్రిదీ బాధ్యతాయుతంగా వ్యవహరించలేదని, అతని నిర్లక్ష్యమే రెండు మేజర్ టోర్నీల్లో పరాజయాలకు కారణమని పిసిబికి సమర్పించిన నివేదికలో కోచ్, మాజీ కెప్టెన్ వకార్ యూనిస్ ఆరోపించిన విషయం తెలిసిందే. పిసిబి ఆగ్రహానికి గురైన కారణంగా తన పదవికి రాజీనామా చేసిన వకార్ చాలా మంది ఆటగాళ్లు ఇదే రీతిలో వ్యవహరించారని, సపోర్టింగ్ స్ట్ఫా సలహాలు, సూచనలను వారు ఏమాత్రం పట్టించుకోలేదని అప్పట్లో ఆరోపించాడు. ఇలావుంటే, అటు కోచ్ నుంచి ఇటు పిసిబి నుంచి విమర్శలకు గురైన అఫ్రిదీ ఒక చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, పాక్ క్రికెట్ త్వరలోనే మళ్లీ గాడిలో పడుతుందని ధీమా వ్యక్తం చేశాడు. స్కూల్ స్థాయి నుంచే ప్రాబబుల్స్‌ను ఎంపిక చేసి, వారికి ప్రత్యేక శిక్షణ ఇప్పించాలని పిసిబి అధికారులకు సూచించాడు. ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లే పాక్ జట్టుకు నిర్వహిస్తున్న శిక్షణ శిబిరానికి హాజరుకాలేనని తాను ముందుగానే పిసిబి అధికారులకు తెలిపానన్నాడు. ఇంగ్లాండ్ టూర్ కోసం ప్రకటించిన జట్టులో చీఫ్ సెలక్టర్‌గా ఇటీవలే బాధ్యతలు తీసుకున్న ఇంజమాముల్ హక్ నేతృత్వంలోని జాతీయ సెలక్షన్ కమిటీ అహ్మద్ షెజాద్, ఉమర్ అక్మల్‌తోపాటు అఫ్రిదీకి కూడా స్థానం కల్పించలేదు. ఈ విషయాన్ని ప్రస్తావించగా, ఇంగ్లాండ్ టూర్‌కు తాను సిద్ధంగా ఉన్నట్టు సెలక్టర్లకు చెప్పానని అఫ్రిదీ తెలిపాడు. టి-20 ఫార్మెట్‌లో మాత్రమే తాను కెరీర్‌ను కొనసాగిస్తానని, ఆ నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని చెప్పాడు. పాకిస్తాన్ క్రికెట్ ప్రస్తుతం కొన్ని సమస్యలను ఎదుర్కొంటున్నప్పటికీ అవి శాశ్వతం కావని స్పష్టం చేశాడు. త్వరలోనే మళ్లీ గత వైభవాన్ని సంపాదిస్తుందని ధీమా వ్యక్తం చేశాడు.