క్రీడాభూమి

కివీస్ చేతిలో వైట్‌వాష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హామిల్టన్, ఫిబ్రవరి 10: మూడో టీ20లోనూ భారత్‌పై విజయం సాధించడంతో న్యూజిలాండ్ మహిళల జట్టు టీ20 సిరీస్‌ను 3-0 తేడాతో క్లీన్‌స్వీప్ చేసింది. ఆదివారం హామిల్టన్‌లో జరిగిన చివరి మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ మహిళల జట్టు నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయ 161 పరుగులు చేసింది. కివీస్ బ్యాటర్లలో ఓపెనర్ సోపీ డివైన్ (72) అర్ధ సెంచరీతో రాణించగా. మరో ఓపెనర్ సుజీ బేట్స్ (24), అమీ సాటర్‌వైట్ (31) ఆకట్టుకున్నారు. భారత బౌలర్లలో దీప్తీ శర్మ 2, మన్సీ జోషీ, రాధా యాదవ్, అరుంధతీ రెడ్డి, పూనమ్ యాదవ్ తలో వికెట్ తీశారు. 162 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత మహిళ జట్టు మూడో ఓవర్‌లోనే ప్రియా పూనియా (1) వికెట్ కోల్పోయంది. ఈ తరుణంలో స్టార్ బ్యాట్స్ ఉమన్ స్మృతీ మంధాన (86) ధాటిగా ఆడి అర్ధ సెంచరీ సాధించింది. మంధానతో జతకట్టిన జెమీమా రోడ్రీగ్స్ (21) సోపీ డివైన్ బౌలింగ్‌లో తహుహుకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. ఆ తర్వాత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (2) నిరాశ పరచగా, మిథాలీరాజ్ (24), దీప్తీ శర్మ (21) చివరి వరకు క్రీజులో ఉన్నా జట్టును గెలిపించలేకపోయారు. చివరి ఓవర్‌లో భారత్ గెలుపునకు 16 పరుగులు కావాల్సి ఉండగా, మిథాలీ, దీప్తీ చెరో ఫోర్ కొట్టి జట్టును గెలుపు వరకు తీసుకెళ్లారు. కానీ చివరి బంతికి 4 పరుగులు కావాల్సిన తరుణంలో మిథాలీ 2 పరుగుల మాత్రమే చేయడంతో న్యూజిలాండ్ 2 పరుగుల తేడాతో విజయం సాధించింది. న్యూజిలాండ్ బౌలర్లలో సోపీ డివైన్‌కు 2, లీగ్ కాస్పర్క్, అమేలియా కేర్‌కు ఒక్కో వికెట్ దక్కింది. దీంతో మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ను కివీస్ 3-0తో క్వీన్‌స్లీప్ చేసింది.
స్కోర్ బోర్డు..
న్యూజిలాండ్ ఇన్నింగ్స్: 161/7
భారత్ ఇన్నింగ్స్: 159/4
చిత్రాలు.. ట్రోఫీతో న్యూజిలాండ్ మహిళల జట్టు
* స్మృతీ మంధాన (86)