క్రీడాభూమి

దిండాకు తప్పిన ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, ఫిబ్రవరి 11: కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో టీమిండియా పేసర్ అశోక్ దిండా బౌలింగ్ చేస్తుండగా గాయపడ్డాడు. బ్యాట్స్‌మన్ కొట్టిన బంతి నేరుగా వచ్చి దిండా ముఖానికి తగలడంతో పిచ్‌పైనే కుప్పకూలాడు. దీంతో సిబ్బంది ప్రథమ చికిత్స అనంతరం సమీప ఆస్పత్రికి తరలించారు. గాయానికి సిటీ స్కానింగ్ తీసిన వైద్యులు పెను ప్రమాదం తప్పినట్లు వెల్లడించారు. కాగా 2009లో శ్రీలంకతో జరిగిన టీ20 మ్యాచ్‌తో అశోక్ దిండా భారత జట్టులోకి ఆరంగేట్రం చేశాడు. ఆ తర్వాత కొన్నాళ్లు జట్టుకు దూరంగా ఉండగా, 2013లో చివరగా భారత్ తరఫున ఆడిన దిండా, అటు తర్వాత దేశవాళీ, ఐపీఎల్ క్రికెట్‌కే పరిమితమయ్యాడు.