క్రీడాభూమి

రైనా vs మెక్‌కలమ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 15: తొమ్మిదో ఐపిఎల్‌లో కొత్తగా వచ్చి చేరిన రాజ్‌కోట్ జట్టుకు నాయకత్వం వహించే అవకాశం కోసం సురేష్ రైనా, బ్రెండన్ మెక్‌కలమ్ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. మహేంద్ర సింగ్ ధోనీని కొనుగోలు చేసిన మరో కొత్త జట్టు పుణె అతనినే కెప్టెన్‌గా నియమించడం ఖాయంగా కనిపిస్తున్నది. అయితే, రాజ్‌కోట్‌లోనే సారథ్య బాధ్యతలు ఎవరికి దక్కుతాయన్నదని ఉత్కంఠ రేపుతున్నది. రైనాతో పోలిస్తే ఒక జట్టుకు నాయకత్వం వహించిన అనుభవం న్యూజిలాండ్ కెప్టెన్ మెక్‌కలమ్‌కు ఉంది. అంతేగాక, అంతర్జాతీయ క్రికెట్‌లో రైనా కంటే అతనే ముందు వరుసలో ఉన్నాడు. ధోనీకి అత్యంత సన్నిహితుడిగా ముద్రపడ్డాడు కాబట్టి రైనాకు రాజ్‌కోట్ ఫ్రాంచైజీ తొలి ప్రాధాన్యతనిచ్చిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, కెప్టెన్సీని కూడా అతనికే అప్పగిస్తారా లేదా అన్న చర్చ జోరందుకుంది.
ఆరోగ్యకరమైన పోటీ: రైనా
ధోనీతో తనకు ఆరోగ్యకరమైన పోటీ ఉంటుందని రైనా అన్నాడు. ఐపిఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ధోనీ నాయకత్వంలోనే రైనా ఆడాడు. ఎనిమిది సీజన్లు అతనితో కలిసి ఆడిన రైనా ఇప్పుడు హఠాత్తుగా మరో జట్టు నుంచి మైదానంలోకి దిగనున్నాడు. దీనితో ధోనీతో ఏదో ఒక సమయంలో తీవ్రంగా పోటీపడక తప్పదు. ఈ అంశాన్ని అతను విలేఖరులతో ముచ్చటిస్తున్నప్పుడు ప్రస్తావించాడు. ధోనీతో ఆరోగ్యకరమైన పోటీని కొనసాగిస్తానని చెప్పాడు. రాజ్‌కోట్ తనకు మొదటి ప్రాధాన్యతనివ్వడం ఎంతో ఆనందంగా ఉందని అన్నాడు.