క్రీడాభూమి

ప్రారంభ వేడుకలకు రండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 17: ఫిఫా వరల్డ్ కప్ జరిగే 2022 పోటీలకు హాజరయ్యేందుకు వీలుగా వరల్డ్ కప్ క్రికెట్‌లో చాంపియన్లుగా ఆవిర్భవించిన భారత జట్టు సభ్యులకు కతార్ ఆహ్వానం పలికింది. 1983, 2011 సీజన్‌లో వరల్డ్ కప్‌లో చాంపియన్లుగా నిలిచిన భారత జట్టు క్రికెటర్లు కతార్‌లో 2022లో జరిగే ఫిఫా వరల్డ్ కప్‌లో పాల్గొనేందుకు తాము సాదరంగా ఆహ్వానిస్తున్నామని ఫిఫా వరల్డ్ కప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నాసర్ ఆల్ ఖతర్ పేర్కొన్నాడు. భారత్‌లో క్రికెట్‌కు ఆదరణ ఎంతో ఉందన్న విషయాన్ని తాము గుర్తించామని, అందువల్లే రానున్న ఫిఫా వరల్డ్ కప్ ప్రారంభ వేడుకల్లో తమతోపాటు పాలుపంచుకునేందుకు వీలుగా 1983, 2011 సీజన్‌లలో జరిగిన వరల్డ్ కప్ క్రికెట్‌లో చాంపియన్లుగా నిలిచిన భారత క్రికెట్ జట్లలోని సభ్యులందర్నీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నాడు. అదేవిధంగా భారత్‌లోని ఫుట్‌బాల్ క్రీడాకారులను సైతం ప్రారంభ వేడుకలకు ప్రత్యేకంగా రావాలని ఆహ్వానిస్తున్నామని తెలిపాడు. 1983లో క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ సారథ్యంలో, 2011లో బ్యాట్స్‌మన్-వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలో భారత్ వరల్డ్ కప్ చాంపియన్‌గా నిలిచింది.