క్రీడాభూమి

జవాన్ల కుటుంబాలకు సాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢిల్లీ, ఫిబ్రవరి 17: జమ్మూ-కాశ్మీర్‌లోని పుల్వామాలో గురువారం పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ జైష్-ఈ-మహమ్మద్ జరిపిన భీకర దాడిలో 44 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు మరణించిన నేపథ్యంలో వారి కుటుంబాలను ఆదుకునేందుకు ఎంతోమంది క్రీడాకారులు వివిధ రూపాల్లో సహాయపడేందుకు ముందుకు వస్తున్నారు. భారత క్రికెటర్ జట్టు ఓపెనర్ శిఖర్ ధావన్ సైతం వీర సైనికుల కుటుంబాలకు తాను సైతం ఆసరాగా ఉంటానని భరోసా ఇచ్చాడు. ఇందులో భాగంగా ట్విట్టర్ వేదికగా బాధాతప్త హృదయంతో ఉన్న వీడియోను విడుదల చేస్తూ పాక్ ముష్కరుల భీకర దాడిలో అసువులు బాసిన వీర జవాన్ల కుటుంబాలను ఆదుకునేందుకు ప్రతిఒక్కరూ ముందుకు రావాలని తన అభిమానులతోపాటు భారత పౌరులకు విజ్ఞప్తి చేశాడు. ఇదిలావుండగా, పాక్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన సీఆర్‌పీఎఫ్ సైనికుల పిల్లలందరికీ తమ పాఠశాలలో ఉచిత అందిస్తానని భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెవాగ్ శనివారం ప్రకటించిన విషయం తెలిసిందే. సైనికుల పిల్లలకు చదువు చెప్పించడాన్ని తనకు కలిగిన గౌరవంగా భావిస్తానని ట్విట్టర్ వేదికగా సెవాగ్ పేర్కొన్నాడు. అదేవిధంగా హర్యానా పోలీస్ శాఖలో పనిచేస్తున్న బాక్సర్ వీరేంద్ర సింగ్ సైతం తన నెల రోజుల జీతాన్ని పుల్వామా బాధిత సైనిక కుటుంబాలకు అందజేయనున్నట్టు ప్రకటించాడు. వీర సైనికుల కుటుంబాలను ఆదుకునేందుకు ప్రతిఒక్కరూ ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చాడు. అదేవిధంగా విదర్భ క్రికెట్ కెప్టెన్ ఫైజ్ ఫాజల్ సైతం ఇరానీ కప్‌లో తమ జట్టు గెలుపొందిన ప్రైజ్ మనీని పుల్వామా బాధిత జవాన్ల కుటుంబాలకు అందజేయనున్నట్టు ప్రకటించాడు. సీఆర్‌పీఎఫ్ దళాలపై పాక్ ముష్కరులు జరిపిన భీకర యుద్ధకాండను టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, మాజీ కెప్టెన్ సచిన్ తెండూల్కర్, క్రికెటర్లు రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్య, వీవీఎస్ లక్ష్మణ్, సురేష్ రైనా, మహమ్మద్ కైఫ్ తదితరులు ముక్తకంఠంతో ఖండించారు.