క్రీడాభూమి

విరాట్ సేన.. తలొగ్గేనా?!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: భారత్-ఆస్ట్రేలియా సిరీస్ ఈ నెల 24 నుంచి ప్రారంభం కానుంది. ప్రపంచకప్‌కు ముందు భారత్‌కు ఇదే చివరి సిరీస్ కావడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ఓవైపు యువకులకు అవకాశాలు కల్పిస్తూనే, జట్టు పటిష్టత బలంగా ఉండే విధంగా ప్రణాళికలు రూపొందించే పనిలో నిమగ్న మైంది. ఇందులో భాగంగా మొదటి రెండు మ్యాచ్‌ల్లో సిద్ధార్థ్ కౌల్, టీ20 సిరీస్‌లో మయాంక్ మార్కండేకు అవకాశ మిచ్చింది. న్యూజిలాండ్‌తో చివరి రెండు వనే్డలకు దూరమైన కెప్టెన్ కోహ్లీ, సిరీస్‌కు దూరమైన పేసర్ జస్ప్రీత్ బూమ్రా జట్టులోకి రావడంతో భారత్ బలంగానే కనిపిస్తోంది. అయతే చాలా రోజుల తర్వాత టీమిండియా ఉపఖండ పిచ్‌లపై ఆడనుంది. ఇది కలిసొచ్చే అంశమే అయనా, ఈ సిరీస్‌లో ప్రతి మ్యాచ్ కీలకమే కానుంది. ప్రపంచకప్ ముందు ప్రత్యర్థిని మట్టికరిపిస్తేనే జట్టులో రెట్టింపు ఉత్సహం నింపినట్లవుతోంది. గత న్యూజిలాండ్ వనే్డ సిరీస్ నెగ్గినా చివరి మ్యాచ్‌లు ఓడిపోవడం కాస్త అభిమా నులను కాస్త నిరాశ పరిచిందనే చెప్పవచ్చు.
ఆత్మ విశ్వాసంతో ఫించ్ సేన
మరోవైపు స్వదేశంలో భారత్ చేతిలో ఇటు టెస్టు, అటు వనే్డ సిరీస్‌లో ఓడినా ఆస్ట్రేలియా జట్టు ఆత్మ విశ్వాసంతో కనిపిస్తోంది. భారత్‌తో సిరీస్ తర్వాత శ్రీలంకతో జరిగిన రెండు టెస్టులను గెలిచింది. మరోవైపు ఫించ్‌తో పాటు షాన్ మార్ష్, ఉస్మాన్ ఖాజా, వికెట్ కీపర్ అలెక్ స క్యారీ మంచి ఫాంలో ఉండడం కూడా ప్రత్యర్థి జట్టుకు కలిసొచ్చే అంశమే. దీంతో పాటు వరుస వైఫల్యాలను ఎదుర్కొంటున్న ప్రస్తుత ఆసీస్ జట్టును గాడిలో పెట్టేందుకు సినీయర్లు తమ జట్టుకు సహకారమందించే పనిలో నిమగ్నమయ్యారు. వారు పాంటింగ్, మెక్‌గ్రాత్, లాంగర్ వంటి ఆటగాళ్లకు భారత ఉపఖండం పిచ్‌లపై ఆడిన అనుభవం ఉండడంతో అందుకు తగినట్లుగా తమ ఆటగాళ్లకు పలు సూచనలిచ్చే అవకాశముంది.
గత రికార్డుల ప్రకారం భారత్‌లో మొత్తం 29 వనే్డ మ్యాచ్‌లు జరగ్గా, ఆస్ట్రేలియా 14, టీమిండియా 12 విజయాలు సాధించింది. 3 ఫలితం తేలలేదు. అయతే గతంలో పర్యటించిన ఆసీస్ జట్టులో హేమాహేమీలుండగా, ప్రస్తుత జట్టులో చాలా వరకు భారత పిచ్‌లపై అనుభవం లేనివారే కావడం వారికి ప్రతికూలించే అంశమనే చెప్పాలి. ఎలాగైనా భారత్‌ను వారి సొంత గడ్డపై ఓడిస్తే ప్రతీకారంతో పాటు ప్రపంచకప్ ముందు భారత్‌ను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టాలని ఆస్ట్రేలియా భావిస్తోంది.
భారత్‌కు అచ్చొచ్చిన మైదానం
ఈ నెల 24న విశాఖపట్నం వేదికగా డా. వైఎస్ రాజశేఖరరెడ్డి మైదానంలో మొదటి టీ20తో సిరీస్ ప్రారంభం కానుంది. ఇక్కడి మైదానంలో టీమిండియా 7 మ్యాచ్‌లాడగా, ఐదింట్లో ఘన విజయం సాధించింది. ఓ మ్యాచ్ రద్దు కాగా, మరో మ్యాచ్ (2013)లో వెస్టిండీస్ విజయం సాధించింది.