క్రీడాభూమి

అంతర్జాతీయ క్రికెట్‌కు చార్లొట్ గుడ్‌బై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, మే 11: ఇంగ్లాండ్ మహిళా జట్టు కెప్టెన్ చార్లొట్ ఎడ్వర్డ్స్ అంతర్జాతీయ కెరీర్‌కు గుడ్‌బై చెప్పింది. 1996 జూలైలో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టుతో అరంగేట్రం చేసిన ఆమె సుమారు 20 సంవత్సరాలు ఇంగ్లాండ్ జట్టులో కీలక క్రీడాకారిణిగా సేవలు అందించింది. కెరీర్‌లో 23 టెస్టులు ఆడిన ఆమె 43 ఇన్నింగ్స్‌లో 1,676 పరుగులు సాధించింది. అత్యధిక స్కోరు 117 పరుగులు. నాలుగు శతకాలు, తొమ్మిది అర్ధ శతకాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. 191 వనే్డలు ఆడిన ఆమె 180 ఇన్నింగ్స్‌లో 5,9992 పరుగులు చేసింది. అత్యధిక స్కోరు 173 (నాటౌట్). తొమ్మిది శతకాలు, 46 అర్ధ శతకాలను సాధించింది. టి-20 ఫార్మెట్‌లో 95 మ్యాచ్‌లు (93 ఇన్నింగ్స్)లో 2,605 పరుగులు చేసిన ఆమె అత్యధిక స్కోరు 92 (నాటౌట్). ఈ విభాగంలో ఆమె 12 అర్ధ శతకాలను నమోదు చేసింది. ఇంగ్లాండ్ తరఫున 309 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి, పది వేలకుపైగా పరుగులు సాధించి ప్రపంచ రికార్డు నెలకొల్పిన ఆమె క్రికెట్‌కు దూరం కావడం తనను ఎంతగానో బాధిస్తున్నదని చెప్పింది. అయితే, రిటైర్మెంట్ అన్నది ఏదో ఒక సమయంలో తప్పదని వ్యాఖ్యానించింది. కెరీర్ నిర్మాణం నుంచి ఎదుగుదల వరకూ తనకు అడుగడుగునా సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపింది.