క్రీడాభూమి

ఫామ్‌లోనే ఉన్నా జొకోవిచ్‌తో పోరుకు సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రోమ్, మే 11: తాను ఫామ్‌లోనే ఉన్నానని, ప్రపంచ నంబర్ వన్ నొవాక్ జొకోవిచ్‌తో పోరుకు సిద్ధమని రోమ్ మాస్టర్స్ టోర్నీలో పాల్గొంటున్న మాజీ నంబర్ వన్ రాఫెల్ నాదల్ అన్నాడు. అయితే, జొకోవిచ్‌తో తన మ్యాచ్ ఇప్పుడే కాదుకదా అని ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వ్యాఖ్యానించాడు. గాయం సమస్య చాలా వరకు నయమైందని, ఫిలిప్ కొల్చెర్‌బెర్‌తో జరిగే రెండో రౌండ్ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదుచూస్తున్నానని నాదల్ అన్నాడు. గత వారం మాడ్రిడ్ ఓపెన్‌లో ఆడిన నాదల్ సెమీ ఫైనల్‌లో ఆండీ ముర్రే చేతిలో ఓడాడు. ఆ విషయాన్ని ప్రస్తావించగా, జయాపజయాలు క్రీడల్లో చాలా సహజమని అన్నాడు. ప్రతి మ్యాచ్‌నీ కీలకంగానే భావిస్తానని, రానున్న మ్యాచ్‌లపైనే దృష్టి కేంద్రీకరిస్తానని చెప్పాడు.
ఫెదరర్‌కు ఫిట్నెస్ సమస్య!
ప్రపంచ మాజీ నంబర్ వన్ రోజర్ ఫెదరర్ ఫిట్నెస్ సమస్యను ఎదుర్కొంటున్నట్టు సమాచారం. అలెగ్జాండర్ జ్వెరెవ్‌తో మ్యాచ్‌లో అతను పాల్గొనే అవకాశం లేదని తొలుత వార్తలు వెలువడ్డాయి. అయితే, ఫెదరర్ మ్యాచ్‌కి హాజరై, 6-3, 7-5 తేడాతో విజయం సాధించి మూడో రౌండ్‌లోకి అడుగుపెట్టాడు. కానీ, గాయాన్ని పట్టించుకోకుండా మ్యాచ్ ఆడడం వల్ల అతని ఫిటెస్ సమస్య రెట్టింపయ్యే ప్రమాదం ఉందని నిపుణుల అభిప్రాయం. కాగా, గాయం విషయంలో ఫెదరర్ నుంచి ఇప్పటి వరకూ ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

‘స్పిన్’లో శిక్షణ కోసం
భారత్‌కు దక్షిణాఫ్రికా యువ క్రికెటర్లు

జొహానె్నస్‌బర్గ్, మే 11: స్పిన్ బౌలింగ్‌కు చిరునామాగా చెప్పుకొనే భారత్‌కు యువ ఆటగాళ్లను పంపాలని క్రికెట్ దక్షిణాఫ్రికా (సిఎస్‌ఎ) నిర్ణయించింది. ముంబయిలో శనివారం నుంచి ప్రారంభమయ్యే వారం రోజుల శిబిరానికి ఎనిమిది మంది స్పిన్ బౌలర్లను పంపుతున్నట్టు సిఎస్‌ఎ హై పర్ఫార్మెన్స్ మేనేజర్ విన్నీ బర్నెస్ తెలిపాడు. వీరితోపాటు ఆరుగురు బ్యాట్స్‌మెన్ కూడా ముంబయి వెళతారని పేర్కొన్నాడు. శిబిరానికి హాజరయ్యేందుకు యువ స్పిన్ బౌలర్లు జాన్ ఫోర్టూన్, సైమన్ హార్మర్, జార్జి లిండే, కేశవ్ మహారాజ్, షెపో టులీ, ఆరోన్ ఫాంగిసో, డేన్ పిడిట్, ప్రెనెలాన్ సబ్రెయెన్ లను ఎంపిక చేసినట్టు చెప్పాడు. అదే విధంగా స్పిన్‌ను సమర్థంగా ఎదుర్కోవడానికి మెళకువలు నేర్చుకోవడానికి బ్యాట్స్‌మెన్ టెంబా బవూమా, రీజా హెండ్రిక్స్, స్మంగాలిసో నెబెలా, హెక్టర్ గోబెనీ, స్టియాన్ వాన్ జిల్, డేన్ విలాస్‌లు ఎంపికయ్యారని బర్నెస్ వివరించాడు. ఈ శిక్షణ వారికి భవిష్యత్తులో ఎంతో ఉపయోగపడుతుందని అన్నాడు.