క్రీడాభూమి

అమ్మాయలు సూపర్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయ, ఫిబ్రవరి 22: ఐసీసీ చాంపియన్ షిప్‌లో భాగంగా ముంబయ వాంఖడే స్టేడియంలో శుక్రవారం ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి వనే్డలో భారత మహిళల జట్టు 66 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అంతకుముందు టాస్ గెలిచి భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించిన ఇంగ్లాండ్ మహిళల జట్టు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసింది. దీంతో పరుగులు రాబట్టేందుకు భారత బ్యాట్ ఉమెన్స్ తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఇన్నింగ్స్ నెమ్మదిగా సాగుతున్న తరుణంలో స్టార్ ఓపెనర్ స్మృతీ మంధాన (24) ఎల్వీస్ బౌలింగ్ బౌల్డ్ అయంది. ఈ తరుణంలో క్రీజులోకి వచ్చిన దీప్తి శర్మ (7) కూడా సోపీ ఎకిల్‌స్టోన్ బౌలింగ్‌లో స్టాంపవుట్ కావడంతో 85 పరుగులకే భారత్ రెండు వికెట్లను కోల్పోయంది. ఆ త ర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన కెప్టెన్ మిథాలీ రాజ్, మరో ఓపెనర్ జెమీమా రోడ్రిగ్స్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యత భుజాన వేసుకుంది. అయతే అప్పటివరకు అచితూచి ఆ డుతున్న రోడ్రిగ్స్ (48) సోపీ ఎకిల్‌స్టోన్ బౌలింగ్‌లో తనకే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. మూడు కీలక వికెట్లను కోల్పోయ కష్టాల్లో పడింది. మరోవైపు మిథాలీ చెత్త బంతుల్ని బౌండరీలకు తరలిస్తూ స్కోరు బోర్డును పెంచినా, ఆ తర్వాత వచ్చిన హర్లీన్ డియోల్ (2), మోనా మెస్త్రం (0) వెనువెంటనే పెవిలియన్‌కు చేరారు. దీంతో తనియా భటియా కెప్టెన్‌తో జతకట్టి వేగంగా పరుగులు రాబట్టారు. ఈ భటియా (25) రనౌట్ అయంది. మరోవైపు మిథాలి సినీయర్ ప్లేయర్ జులాన్ గోస్వామితో జతకట్టింది. జులాన్ గోస్వామి వచ్చి రావడంతో ఇంగ్లీష్ బౌలర్లపై విరుచుకుపడింది. 1 సిక్స్ 3 ఫోర్లతో చెలరేగింది. మరోవైపు మిథాలీ (44) ఎల్వీస్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరగడంతో భారతో 165 పరుగులకే 7 వికెట్లను కోల్పోయంది. ఆ తర్వాత జులాన్ గోస్వామి (30), శిఖా పాండే (11), ఏక్తా బిష్త్ (0) వికెట్లను కూడా కోల్పోవడంతో భారత్ 49.4 ఓవర్లలో 202 పరగులకు ఆలౌటైంది. ఇంగ్లాండ్ బౌలర్లలో జర్జియా ఎల్వీస్, నటలీ స్కీవర్, సోపీ ఎకిల్‌స్టోన్ తలో రెండు వికెట్లు తీసుకోగా, అన్య శ్రుబ్‌సోల్‌కు ఒక వికెట్ దక్కింది.
ఆదిలోనే దెబ్బ..
203 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు అమీ ఎలెన్ జోన్స్ (1)ని శిఖా పాండ్ అవుట్ చేయగా, టామీ బియామాంట్ (18)ను దీప్తి శర్మ పెవిలియన్‌కు పంపింది. ఆ తర్వాత వచ్చిన సారా టేలర్ (10) కూడా వెంటనే అవుట్ కావడంతో 38 పరుగులకే ఇంగ్లాండ్ 3 వికెట్లు చేజార్చుకుంది. దీంతో బ్యాటింగ్‌కు వచ్చిన కెప్టెన్ హీదర్ నైట్, నటలీ స్కీవర్‌తో కలిసి జట్టుకు 73 పరగుల విలువైన భాగస్వామ్యాన్ని అందించారు. ఈ క్రమంలో నటలీ స్కీవర్ (44) రనౌట్ కావడంతో మ్యాచ్ భారత్ వైపు తిరిగింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన డానిమెల్లీ వ్యాట్ (1), కెథరిన్ బ్రంట్ (7), జర్జియా ఎల్వీస్ (6), అన్య శ్రుబ్‌సోల్ (0), సోపీ ఎకిల్‌స్టోన్ (0), అలెక్స్ హర్ట్‌లీ (0)ను భారత బౌలర్లు వెంటనే పెవిలియన్‌కు పంపడంతో ఇంగ్లాండ్ 41 ఓవర్లలోనే ఆలౌటైంది. ఇంగ్లాండ్ కెప్టెన్ హీదర్ నైట్ (39) నాటౌట్‌గా నిలిచినా జట్టును గట్టెక్కించలేకపోయంది. భారత బౌలర్లలో ఏక్తాబిష్త్‌కు నాలుగు వికెట్లు దక్కాయ.