క్రీడాభూమి

పాక్‌తో మ్యాచ్‌పై నిర్ణయం బీసీసీఐదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం (స్పోర్ట్స్), ఫిబ్రవరి 23: వరల్డ్ కప్‌లో పాకిస్తాన్‌తో మ్యాచ్ విషయంలో బీసీసీఐ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని, దేశం వెంటే భారత్ క్రికెట్ జట్టు ఉంటుందని కెప్టెన్ విరాట్‌కోహ్లీ స్పష్టం చేశారు. ఆస్ట్రేలియాతో విశాఖలో జరగనున్న తొలి టీ ట్వంటీ మ్యాచ్ ప్రాక్టీస్ సందర్భంగా కోహ్లీ శనివారం నాడిక్కడ విలేఖరులతో మాట్లాడుతూ పాక్‌తో మ్యాచ్ విషయంలో భారత ప్రభుత్వం, బీసీసీఐ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. పుల్వామా ఘటనలో అసువులు బాసిన వీర జవాన్లకు భారత్ జట్టు ప్రగాఢ సంతాపాన్ని తెలుపుతోందన్నారు. బాధిత కుటుంబాలకు జట్టు అండగా ఉంటుందన్నారు.
ఆస్ట్రేలియా గడ్డపై గెలుపు ఆత్మస్థైర్యాన్ని పెంచింది..
ఆస్ట్రేలియా గడ్డపై గెలుపొందడం భారత్ జట్టు ఆత్మస్థైర్యాన్ని పెంచిందని, ఈ సిరీస్‌లో కూడా గెలుస్తామన్న ధీమా వ్యక్తం చేశాడు. ఏ ఫార్మాట్‌లోనైనా తాను రాణించగలుగుతున్నానని, ఈ ఫాంను కొనసాగించేందుకు కృషి చేస్తానన్నారు. కీలక సమయాల్లో దూకుడుగా అడేందుకు టీ ట్వంటీ ఫార్మాట్ ఎంతో ఉపకరిస్తుందని, వరల్డ్ కప్ ముందు ఈ సిరీస్, ఐపీఎల్ మ్యాచ్‌లు ఉపయుక్తంగా ఉంటాయన్నారు. టీ ట్వంటీ, వనే్డ ఫార్మాట్ రెండింటినీ సమతౌల్యం చేసుకుని ఆడే నైపుణ్యాన్ని ప్రతి క్రికెటర్ అలవరుచుకోవాలన్నారు. ప్రతి క్రికెటర్ ఫిట్నెస్‌ను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. జట్టులో యువ ఆటగాళ్లు చక్కగా రాణిస్తున్నారని, వారికి అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు సాధిస్తారన్నారు. జట్టులో సీనియర్, జూనియర్ అనే వ్యత్యాసం లేకుండా అందర్నీ సమన్వయం చేసుకుంటున్నామని అన్నాడు. భారత్ ప్రస్తుతం మంచి ఫాంలో ఉందని, జట్టులో సభ్యులను మార్చాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డాడు.