క్రీడాభూమి

డేర్ డెవిల్స్‌కు సన్‌రైజర్స్ భయం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 11: మాజీ ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్ నాయకత్వంలోని ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ను డేవిడ్ వార్నర్ కెప్టెన్‌గా సేవలు అందిస్తున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ భయపెడుతున్నది. ఉప్పల్ స్టేడియంలో గురువారం జరిగే కీలక మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ను ఓడిస్తేనే డేర్‌డెవిల్స్ నాటౌట్ ఆశలు సజీవంగా ఉంటాయి. ఒకవేళ ఓడితే, మిగతా మ్యాచ్‌ల్లో తప్పక గెలవడంతోపాటు, ఇతర జట్ల ఫలితాలపై డేర్‌డెవిల్స్ నాటౌట్ అవకాశాలు ఆధారపడతాయి. అందుకే, ఈ మ్యాచ్‌ని జహీర్ బృందం కీలంగా భావిస్తున్నది. భారత మాజీ క్రికెటర్ ‘ది వాల్’ రాహుల్ ద్రవిడ్ కోచ్‌గా ఉన్న ఈ జట్టు ఇప్పటి వరకూ తొమ్మిది మ్యాచ్‌లు ఆడి, ఐదు విజయాలను సాధించింది. నాలుగు పరాజయాలను ఎదుర్కొంది. క్వింటన్ డికాక్, కెప్టెన్ జహీర్ ఖాన్, వికెట్‌కీపర్-బ్యాట్స్‌మన్ సంజూ శాంసన్, టాప్ ఆర్డర్ ఆటగాడు కరుణ్ నాయర్ వంటి మేటి ఆటగాళ్లు ఈ జట్టులో ఉన్నారు. యువ క్రికెటర్లు రిషభ్ పంత్, సంజూ శాంసన్ భారీ స్కోర్లు సాధిస్తే, డేర్‌డెవిల్స్‌కు గెలిచే అవకాశాలు మెరుగవుతాయి.
కాగితంపై చూస్తే బలంగానే కనిపిస్తున్నప్పటికీ, మైదానంలోకి దిగిన తర్వాత నిలకడగా ఆడలేకపోతున్న డేర్‌డెవిల్స్‌కు సన్‌రైజర్స్‌ను కట్టడి చేయడం సులభం కాదనేది నిజం. కెప్టెన్ వార్నర్ అసాధారణ ఫామ్‌లో ఉన్నాడు. శిఖర్ ధావన్ కూడా తనదైన స్ట్రోక్ ప్లేతో అలరిస్తున్నాడు. కేన్ విలియమ్‌సన్, మోజెస్ హెన్రిక్స్, దీపక్ హూడాతోపాటు వికెట్‌కీపర్ నమన్ ఓఝా కూడా కీలక సమయాల్లో భారీ స్కోర్లు చేయగల సమర్థులే. బౌలింగ్ విషయానికి వస్తే భువనేశ్వర్ కుమార్, వెటరన్ పేసర్ ఆశిష్ నెహ్రా, బంగ్లాదేశ్ సంచలన ఫాస్ట్ బౌలర్ ముస్త్ఫాజుర్ రహ్మాన్, బరీందర్ శరణ్ జట్టుకు అండగా ఉన్నారు. జట్టు మొత్తం ఒకే వ్యూహాన్ని అనుసరిస్తూ, సమష్టిగా కృషి చేస్తే చెప్పుకోదగ్గ స్టార్లు లేకపోయినా విజయాలు సాధించడం కష్టం కాదని సన్‌రైజర్స్ ఇప్పటికే నిరూపించింది. ఆటగాళ్లంతా తమతమ బాధ్యతను నిర్వర్తించడానికి శక్తి వంచన లేకుండా కృషి చేయడమే ఈ జట్టును గెలుపు బాటలో నడిపిస్తున్నాయి. హోం గ్రౌండ్‌లో మ్యాచ్ ఆడడం కూడా వార్నర్ సేనకు కలిసొచ్చే అంశం. ఏవైనా అద్భుతాలు జరిగితే తప్ప సన్‌రైజర్స్ విజయాన్ని డేర్‌డెవిల్స్ అడ్డుకోవడం కష్టసా ధ్యంగానే కనిపిస్తోంది.