క్రీడాభూమి

‘యునైటెడ్’ బస్సుపై దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, మే 11: మాంచెస్టర్ యునైటెడ్ ఫుట్‌బాల్ క్లబ్ ఆటగాళ్లు ప్రయాణిస్తున్న వాహనంపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. అయితే, అదృష్ట వశాత్తు ఈ సంఘటనలో ఎవరూ గాయపడలేదు. వెస్ట్ హామ్ యునైటెడ్‌తో మ్యాచ్ జరిగిన తర్వాత అభిమానులు నిరసన ప్రదర్శనకు దిగి, మాంచెస్టర్ యునైటెడ్ ఆటగాళ్లను అడ్డుకునే ప్రయత్నం చేశారు. చాంపియన్స్ లీగ్ ఫుట్‌బాల్ టోర్నీలో మాంచెస్టర్ యునైటెడ్‌కు అత్యంత కీలకమైన మ్యాచ్ ఆరంభం నుంచి మొదలైన గందరగోళం, ఉద్రిక్త వాతావరణం మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా కొనసాగింది. మ్యాచ్‌ని ఆడేందుకు మాంచెస్టర్ యునైటెడ్ ఆటగాళ్లు హోటల్ నుంచి స్టేడియానికి బయలుదేరిన కొద్ది సేపటికే గుర్తుతెలియని వ్యక్తులు బస్సుపై దాడి చేశారు. బస్సు అద్దాలు ధ్వంసమయ్యాయి. అయితే, సకాలంలో భద్రతా దళాలు చేరుకోవడంతో ఆటగాళ్లు సురక్షితంగా బయటపడ్డారు. దాడి సంఘటనతో తీవ్రమైన ఒత్తిడికి గురైన మాంచెస్టర్ యునైటెడ్ ఆటగాళ్లు తమ స్థాయికి తగినట్టు ఆడలేకపోయారు. ఫలితంగా ఆ జట్టు 2-3 తేడాతో పరాజయాన్ని ఎదుర్కొంది.
అభిమానుల ఆగ్రహం
కీలక మ్యాచ్‌లో మాంచెస్టర్ యునైటెడ్ ఓటమిపాలై, చాంపియన్స్ లీగ్ టాప్-4లో స్థానం సంపాదించే అవకాశాలను చేజార్చుకోవడంతో అభిమానులు ఆగ్రహించారు. ఆ జట్టు ఆటగాళ్లు వెలుతున్న వాహనాన్ని అడ్డుకొని నినాదాలు చేశారు. నిరసన ప్రదర్శనలతో బొలెన్ గ్రౌండ్ పరిసర ప్రాంతాలు హోరెత్తిపోయాయి. అయితే, మ్యాచ్ ఆరంభానికి ముందు జరిగిన సంఘటనతో అప్రమత్తంగా ఉన్న భద్రతా సిబ్బంది రంగంలోకి దిగి, నిరసనకారులను చెల్లాచెదురు చేశారు. ఆటగాళ్లు క్షేమంగా హోటల్‌కు చేరుకోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

ముగ్గురికి అర్జున
హాకీ ఇండియా ప్రతిపాదన
న్యూఢిల్లీ, మే 11: అర్జున అవార్డు కోసం ముగ్గురు పేర్లను హాకీ ఇండియా (హెచ్‌ఐ) సిఫార్సు చేసింది. భారత మహిళల హాకీ జట్టు కెప్టెన్ రితూ రాణి, పురుషుల జట్టులో డ్రాగ్ ఫ్లికర్ విఆర్ రఘునాథ్‌తోపాటు ధరమ్‌వీర్ సింగ్ పేరును కూడా అర్జున కోసం అవార్డుల కమిటీకి ప్రతిపాదన పంపినట్టు హెచ్‌ఐ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ముస్తాక్ అహ్మద్ తెలిపాడు. మేజర్ ధ్యాన్ చంద్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్‌కు సిల్వానస్ డంగ్ డంగ్ పేరును సూచించామని అన్నాడు. అదే విధంగా ద్రోణాచార్య అవార్డుకు వెటరన్ కోచ్ సిఆర్ కుమార్ పేరును పంపామని చెప్పాడు. 60 ఏళ్ల డంగ్ డంగ్ 1980లో జరిగిన మాస్కో ఒలింపిక్స్‌లో భారత్ స్వర్ణ పతకం సాధించడంలో కీలక పాత్ర పోషించాడని గుర్తుచేశాడు. స్పెయిన్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను చేసిన గోల్డెన్ గోల్ భారత్‌ను విజయపథంలో నడిపిందని అన్నాడు. 2005లో పాకిస్తాన్‌తో జరిగిన ద్వైపాక్షిక హాకీ సిరీస్‌తో అంతర్జాతీయ కెరీర్‌ను ఆరంభించిన రఘునాథ్ భారత జట్టులో కీలక పాత్ర పోషిస్తున్నాడని అన్నాడు. 2014 ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన భారత జట్టులో ధరమ్‌వీర్ కూడా ఉన్నాడని తెలిపాడు. రితూ రాణి నేతృత్వంలో భారత్ మహిళల జట్టు రియో ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించిందని ముస్తాక్ అహ్మద్ అన్నాడు. అవార్డులకు వీరంతా అర్హులని పేర్కొన్నాడు.