క్రీడాభూమి

భారత్‌దే సిరీస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 28: భారత్ పర్యటనలో ఉన్న ఇంగ్లాండ్ మహిళల క్రికెట్ జట్టుకు ఊరట లభించింది. గురువారం ఇక్కడి వాంఖడే స్టేడియంలో జరిగిన చివరి, మూడో వనే్డను రెండు వికెట్ల తేడాతో గెల్చుకొని, భారత్ చేతిలో వైట్‌వాష్ వేయించుకోకుండా బయటపడింది. అయితే, సిరీస్‌ను మాత్రం మిథాలీరాజ్ నాయకత్వంలోని భార త జట్టు 2-1 తేడాతో కైవసం చేసుకుంది. అప్పటికే సిరీస్‌ను తమ ఖాతాలో వేసుకున్న ధీమాతో, గురువారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్, నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 205 పరుగులు సాధించింది. స్మృతి మందానా, పూనమ్ రావత్ అర్ధ శతకాలతో కదం తొక్కారు. మందానా 74 బంతులు ఎదుర్కొని, ఎనిమిది ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 66 పరుగులు సాధించగా, పూనమ్ 97 బంతుల్లో, ఏడు ఫోర్లతో 56 ప రుగులు చేసింది. వీరితోపాటు దీప్తీ శర్మ (27 నాటౌట్), శిఖా పాండే (26) మాత్రమే కనీ సం రెండంకెల స్కోర్లు నమోదు చేయగా, మిగతా వారు సింగిల్ డిజిట్స్‌కే పరిమితమయ్యారు. ఇంగ్లాండ్ బౌలర్లలో కాథరిన్ బ్రం ట్ 28 పరుగులిచ్చి, ఐదు వికెట్లు కూల్చింది. అన్యా షబ్‌స్రోల్, జార్జియా ఎల్విస్, నటాలీ సివర్ తలా ఒక్కో వికెట్‌ను తమ ఖాతాల్లో వేసుకున్నారు. భారత్‌కు క్లీన్‌స్వీప్ సాధించే అవకాశానికి గండి కొట్టాలన్న పట్టుదలతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 48.5 ఓవర్లలో, ఎనిమిది వికెట్లు కోల్పోయి 208 పరుగులు సాధించింది. రెండు పరుగుల తేడాతో విజయభేరి మోగించింది. టాప్ ఆర్డర్ విఫలమైనప్పటికీ, మిడిల్ ఆర్డర్‌లో కెప్టెన్ హీథర్ నైట్ 47 పరుగులతో జట్టును ఆదుకుంది. చివరిలో డానియెలె వాట్ (56), జార్జియా ఎల్విస్ (33 నాటౌట్) భారత బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొని, జట్టు విజయంలో ప్రధాన భూమిక పోషించారు. భారత బౌలర్లలో ఝూలన్ గోస్వామి 41 పరుగులకు మూడు, శిఖా పాండే 34 పరుగులకు రెండు చొప్పున వికెట్లు పడగొట్టారు.
సంక్షిప్త స్కోర్లు
భారత్ ఇన్నింగ్స్: 50 ఓవర్లలో 8 వికెట్లకు 205 (స్మృతి మందానా 66, పూనమ్ రావత్ 56, దీప్తీ శర్మ 27 నాటౌట్, శిఖా పాండే 26, కాథరిన్ బ్రంట్ 5/28).
ఇంగ్లాండ్ ఇన్నింగ్స్: 48.5 ఓవర్లలో 8 వికెట్లకు 208 (హీథర్ నైట్ 47, డానియెలె వాట్ 56, జార్జియా ఎల్విస్ 33, ఝూలన్ గోస్వామి 3/41, శిఖా పాండే 2/34, పూనమ్ యాదవ్ 2/41).
చిత్రాలు..వనే్డ ట్రోఫీతో భారత మహిళా జట్టు

*స్మృతి మందానా (66)