క్రీడాభూమి

మళ్లీ మైదానంలోకి స్టీవ్ స్మిత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిడ్నీ, మార్చి 1: బాల్ ట్యాంపరింగ్ వివాదంతో ఏడాది కాలంగా జట్టుకు దూరమైన ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ మళ్లీ ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. గతేడాది దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో బాల్ ట్యాంపరింగ్ పాల్పడిన స్మిత్, డేవిడ్ వార్నర్, బౌలర్ బెన్‌క్రాఫ్ట్ నిషేధానికి గురైన విషయం తెలిసిందే. ఇందులో క్రికెట్ ఆస్ట్రేలియా బెన్‌క్రాఫ్ట్‌కు 9 నెలలు నిషేధం విధించగా, స్మిత్,వార్నర్‌కు ఏడాది కాలం నిషేధాన్ని అమలులో ఉంచింది.
దీంతో అప్పట్లో బీపీఎల్ (బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్) మధ్యలోనే స్మిత్ వైదోలగాల్సి వచ్చింది. స్మిత్ నిషేధం ఈ నెల 29కి ముగి యనుండడంతో రానున్న ఐపీఎల్, ప్రపంచకప్‌కు సన్నద్ధమవుతు న్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు స్మిత్ సిడ్నీ స్టేడియంలో శుక్రవారం నెట్ ప్రాక్టీస్ చేశాడు.