క్రీడాభూమి

ఏం చేస్తారో?!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 1: ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ను వారి సొంత గడ్డలపై ఓడించి ఏళ్ల రికార్డులను సవరించిన టీమిండియా సొంత గడ్డపై చ తికిలపడింది. తమ సొంత గడ్డపై ఓడించిన భారత్‌నూ అలాగే ఓడించాలనే కసితో ఇక్కడి పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియా అనుకున్నంతా పనిచేసింది. విశాఖ, బెంగళూరు వేదికగా జరిగిన రెండు టీ20ల్లోనూ అద్భుత ప్రదర్శన కనబరిచి, సిరీస్‌ను 2-0 తేడాతో గెలు చుకుంది. అదే స్థాయ ప్రదర్శనను వనే్డ సిరీస్‌లోనూ కనబరిచి ప్రతీకారం తీసుకోవాలని భావిస్తోంది. మరోవైపు విదేశాల్లో గెలిచి స్వదేశంలో రెండు వరుస టీ20ల్లో ఓడిపోవడం భారత్ జట్టును కుంగదీస్తోంది. మొదటి టీ20ల్లో బ్యాటింగ్‌లో విఫలమైన విరాట్ సేన, రెండో టీ20లో 190 పరుగుల భారీ స్కోర్ చేసినా ఓటమి చవిచూసింది. స్వదేశంలో ఫేవరేట్‌గా బరిలోకి దిగిన టీమిండియా ప్రపంచకప్‌కు ముందు ఇలా పరాజయం చెందడం అభిమానుల్లోనూ కాస్త నిరాశ వ్యక్తమ వుతోంది.
ప్రయోగాలే కొంపముంచుతున్నాయా?
స్వదేశంలో టీమిండియా పరాజయానికి ప్రయోగాలూ ఓ రకమైన కారణమనే భావన అటు అభిమానులు, ఇటు క్రికెట్ వర్గాల్లోనూ వినిపిస్తోంది. జట్టు మేనేజ్‌మెంట్ ప్రపంచకప్‌కు ముందు కుర్రాళ్లకు అవకాశమివ్వాలనే ఉద్దేశంలోనే జట్టు వైఫ ల్యం చెందుతున్నట్లు తెలుస్తోంది. మొదటి వనే్డలో విఫలమైన యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్, రెండో వనే్డలోనూ సింగిల్ డిజిట్‌కే పరిమితమవడం చూస్తే జట్టు కూర్పులో మార్పులు తప్పనిసరి అనిపిస్తోంది. అలాగే రెండో టీ20కి అద్భుత ఫామ్‌లో ఉన్న రెగ్యులర్ ఓపెనర్ రోహిత్ శర్మను తప్పించి కేఎల్ రాహుల్‌తో కలిసి మరో ఓపెనర్ శిఖర్ ధావన్‌ను ఆడిం చడంపై కూడా విమర్శ లొస్తున్నాయ. ఇక బౌలింగ్ విషయా నికొస్తే మొదటి టీ20లో ఉమేశ్ యాదవ్ మినహా మిగతా అందరూ రాణించగా, రెండో మ్యాచ్‌లో వికెట్లు తీసేందుకు భారత బౌలర్లు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. అదే మ్యాచ్‌లో తుది జట్టులో చోటు సంపాదించుకున్న సిద్ధార్థ్ కౌల్, విజయ్‌శంకర్‌లు మాత్రమే వికెట్లు తీయడం గమనార్హం.
ఎవరెవరూంటరో..?!
నేడు ఉప్పల్ వేదికగా జరగనున్న వనే్డ సిరీస్‌లో తుది జట్టులో ఎవరెవ రూంటరోననే సందేహం నెలకొంది. కొద్ది రోజుల గ్యాప్ తర్వాత జట్టులోకి వచ్చిన ఓపెనర్ కేఎల్ రాహుల్ రెండు టీ20ల్లోనూ రాణించడంతో జట్టు కూర్పుపై అయోమయం నెలకొంది. కాఫీ విత్ కరణ్ జోహార్ కార్యక్ర మంలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాహుల్ (50, 47) రెండు మ్యాచ్‌ల్లో అద్భుతంగా రాణించాడు. దీంతో ఓపెనింగ్ సమస్య మళ్లీ మొదటికొచ్చినట్లయంది. ఓపెనర్లుగా రాహుల్, ధావన్ బరిలోకి దిగితే రోహిత్ శర్మ ఏ స్థానంలో ఆడాలి. అలాగే కొద్దిరోజులుగా మూడో స్థానంలో రాణిస్తున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, వనే్డ జట్టులో స్థానం సంపా దించుకన్న అంబటి రాయుడు ఏ స్థానాల్లో బ్యాటింగ్‌కు దిగా లో తెలియని పరిస్థితి. మరోవైపు సీనియర్ బౌలర్ మహమ్మద్ షమీ నెట్ ప్రాక్టీస్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. దీంతో షమీ తుది జట్టులోకి ఎ వరిని పక్కన బెడతారో చూడాలి. ఇక రెగ్యూలర్ బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, యుజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్ ఉండగా, వీరికి తోడు ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, కేదార్ జాదవ్, సిద్ధార్థ్ కౌల్, విజయ్‌శంకర్ ఉన్నారు. వీరిలో ఎవరిని తుది జట్టుకు ఎంపిక చేస్తారో చూడాలి.
ఇదే చివరి సిరీస్
ప్రపంచకప్‌కు ముందు భారత్‌కు ఇదే చివరి సిరీస్ కావడంతో ప్రతిష్టాత్మంగా తీసుకోనుంది. ఇప్పటికే రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను కోల్పోయన భారత్, వనే్డ సిరీస్‌లో ఏ మేరకు రాణిస్తుందోనని అభిమానులు ఎదురుచూస్తున్నారు. మరోవైపు ప్రపంచకప్ సమరం సమీపిస్తుండగా, 5 మ్యాచ్‌ల వనే్డ సిరీస్‌ను నెగ్గి జట్టులో ఉత్సాహం నింపాలని టీమిండియా భావిస్తోంది. ఇదిలాఉంటే టీ20 సిరీస్ నెగ్గిన ఆస్ట్రేలియా జట్టు అదే ఫాం కొనసాగించి వనే్డ సిరీస్‌ను నెగ్గాలని భావిస్తోంది. దీంతో భారత్‌ను సొంత గడ్డపై ఓడించాలనే తమ లక్ష్యం కూడా నెరవేరుతుందనే ఆలోచనల్లో మునిగింది. శుక్రవారం ఇరు జట్లు హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో తీవ్రంగా శ్రమించాయ.
నీఘా నీడన మ్యాచ్
పుల్వామా ఉగ్రదాడి అనంతరం ప్రతీగా భారత్ వాయుసేన దాడుల నేపథ్యంలో శనివారం ఉప్పల్‌లో జరిగే మ్యాచ్‌కు భారీగా బందోబస్తును కేటాయంచారు. స్టేడియం చుట్టు దాదాపు 200 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయగా, మొత్తం మ్యాచ్‌కు యాంటీ టెర్రర్ కమాండో యూనిట్ (అక్టోపస్) పర్యవేక్షణతో పాటుగా దాదాపు 2,300 మంది సిబ్బందిని బందోబస్తుకు కేటాయంచారు.

ప్రాక్టీస్ సెషన్‌లో ధోనీకి గాయం

వనే్డ సిరీస్‌లో భాగంగా హైదరా బాద్‌లో శనివారం జరగనున్న మొద టి వనే్డకు ముందు భారత్‌కు ఎదురు దెబ్బ తగిలింది. శుక్రవారం నెట్ ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్న మహీంద్ర సింగ్ ధోనీ కుడిచేతికి గాయమైంది. దీంతో ప్రాక్టీస్ ఆపి ధోనీ డ్రెస్సింగ్ రూంకే పరిమితమయ్యాడు. దీంతో మొదటి వనే్డలో ధోనీ ఆడతాడా లేదా అనే అనుమానం ఉంది. అయతే ఈ విషయాన్ని టీమిండియా మేనేజ్‌మెం ట్ అధికారికంగా ధ్రువీకరించలేదు. అయతే గాయం తీవ్రతను బట్టి ధోనీకి తుదిజట్టులో అవకాశం ఉంటుదో, లేదో చూడాలి. ఈ విషయమై మ్యాచ్ కు ముందుగానే ప్రకటించే అవకాశ ముంది. కాగా, ధోనీ గాయం నుంచి కోలుకోలేకపోతే అతడి స్థానంలో జట్టు మేనేజ్‌మెంట్ యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ ను తుదిజట్టులోకి తీసుకోనుంది.