క్రీడాభూమి

భారీ ఆధిక్యంలో కివీస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హామిల్టన్, మార్చి 2: న్యూజిలాండ్‌తో జరగుతున్న మొదటి టెస్టు మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 307 పరుగులు వెనుకబడింది. శనివారం మూడో రోజు బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా జట్టులో ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ అర్ధ సెంచరీతో రాణించాడు. మరో ఓపెనర్ షాద్మాన్ ఇస్లాం (37)ను వాగ్నర్ అవుట్ చేశాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మోమినల్ హక్ (8), మహమ్మద్ మిథున్ (0) వెనువెంటనే పెవిలియన్‌కు చేరడంతో బంగ్లా 110 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయ కష్టాల్లో పడింది. ఓ వైపు వికెట్లు పడుతున్నా ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ (74) అర్ధ సెంచరీ సాధించాడు. జట్టు స్కోరును పెంచేలా ధాటిగా ఆడుతున్న తమీమ్‌ను సౌథీ అవుట్ చేశాడు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లా 4 వికెట్లు కోల్పోయ 174 పరుగులు చేసింది. సౌమ్య సర్కార్ (39, బ్యాటింగ్). కెప్టెన్ మహ్మదుల్లా (15, బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. న్యూజిలండ్ బౌలర్లలో బౌల్ట్ 2, సౌథీ, వాగ్నర్‌కు చెరో వికెట్ లభించింది.
అంతకుముందు మొదటి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ ప్రత్యర్థి జట్టు ముందు 6 వికెట్లు కోల్పోయ 715 పరుగుల భారీ స్కోరును ఉంచిన విషయం తెలిసిందే. కివీస్ బ్యాట్స్‌మెన్లలో కెప్టెన్ కేన్ విలియమ్సన్ (200, నాటౌట్), ఓపెనర్లు జీత్ రావల్ (132), టామ్ లాథమ్ (161), హెన్రీ నికోలస్ (53), కొలిన్ డీగ్రాండ్‌హోం (76, నాటౌట్) రాణించారు.
సంక్షిప్త స్కోర్ బోర్డు..
బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్: 234 ఆలౌట్
బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్: 174/4
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 715/6
చిత్రం..తమీమ్ ఇక్బాల్ (74)