క్రీడాభూమి

అన్ని జట్లకూ గట్టి పోటీ ఇస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరాచీ, మార్చి 3: వచ్చే ఏడాది ఇంగ్లాండ్‌లో జరిగే ప్రపంచ కప్ క్రికెట్‌లో పోటీపడే అన్ని జట్లకు తమ జట్టు గట్టి పోటీ ఇస్తుందని వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రేవో అన్నాడు. కరేబియన్ గడ్డపై ఇంగ్లాండ్‌తో జరిగిన వనే్డ సిరీస్‌లో తమ యువ ఆటగాళ్లు చక్కని ఆటతీరుతో చూపిన అపారమైన ప్రతిభే వరల్డ్ కప్‌లో నిదర్శనం కాబోతోందని పేర్కొన్నాడు. ‘మా జట్టులో ఎంతో అద్భుతంగా రాణించగల యువకులు ఎంతోమంది ఉన్నారు. వారంతా తాజాగా ఇంగ్లాండ్‌తో జరిగిన వనే్డ సిరీస్‌లో తమ సత్తా ఏమిటో ఇప్పటికే రుజువు చేశారు. కెప్టెన్ జాసన్ హోల్డర్ సహా జట్టులోని మిగిలిన ఆటగాళ్లతోనూ నేను వ్యక్తిగతంగా మాట్లాడాను. మా జట్టు రానున్న వరల్డ్ కప్‌లో తలపడే అన్ని జట్లకు గట్టి పోటీ ఇస్తుందని ఘంటాపథంగా చెప్పగలను’ అని బ్రేవో వ్యాఖ్యానించాడు. అయితే, వరల్డ్ కప్ టోర్నమెంట్‌లో ఏ జట్టు ఫేవరిట్‌గా నిలుస్తుందన్నది తాను ఇప్పుడే చెప్పలేనని అన్నాడు. ‘ఎవరికైనా బాగా ఆడే రోజు వస్తుందని. మా జట్టులో ఉన్న యువ క్రికెటర్లపై ఉన్న నమ్మకం, మిగిలిన అనుభవజ్ఞులైన సహచరుల సహకారంతో మాకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి’ అని ధీమా వ్యక్తం చేశాడు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)తో జరిగే పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో క్వెట్టా గ్లాడియేటర్స్ తరఫున ప్రాతినిథ్యం వహించనున్న బ్రేవో తన అనుభవాలు, తెలివితేటలు, నైపుణ్యాన్ని జట్టులోని యువకులతో పంచుకోనున్నట్టు తెలిపాడు.